తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు బలిదానం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెలో తీసుకు వెళ్తూ.. తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ సారధిగా ముందుకు సాగారు కేసీఆర్.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పద్నాలు సంవత్సరాలు నిరంతరం ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి కల్పిస్తూ సారధిగా ముందుకు నడిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్ష నెరవేర్చి చిరస్థాయిగా ప్రజలు హృదయాల్లో నిలిచిపోయారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆయన పుట్టిను రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. తాజాగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రజా నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాచీగుడాలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్లపై పడి పెద్ద శబ్ధాలతో పేలిపోయాయి. దాంతో అక్కడ ఉన్నవారంత భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కిందపడిపోయారు.. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కిందపడిపోవడంతో గాయాలు అయ్యాయి.
కాచీగుడాలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడకు వచ్చిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో పాలు పలువురు కార్యకర్తలు గ్యాస్ బెలూన్లు పైకి వదిలారు. అంతలోనే కొంత మంది టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు బెలూన్ల పై పడటంతో పేలిపోయాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా భయబ్రాంతులకు గురై ఎమ్మెల్యే సహ కార్పోరేటర్లు, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి. ఎంతో సంతోషంతో కేసీఆర్ పుట్టిన రోజు వేడులు చేద్దామనుకుంటే గందరగోళంగా మారిపోయింది.