వ్యక్తి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంతో కాటికాపరి ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. అతడు ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఇలా ప్రవర్తించడం సరికాదంటున్నారు.
జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే కల్చర్ చాలా దేశాల్లో ఉంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో వేడుకల్ని చేసుకుంటారు. ఆఖరికి చావును కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. పుట్టినప్పుడు ఎంత ఘనంగా వేడుకలను చేసుకున్నామో.. చనిపోయాక కూడా అంతే సంతోషంగా వారిని సాగనంపుతారు. ఈ కల్చర్ ఎన్నో దేశాల్లో ఉంది. మన దేశంలో కూడా దాదాపుగా అన్ని చోట్ల దీన్ని పాటిస్తారు. అంత్యక్రియలను ఘనంగా నిర్వహించడం, చనిపోయిన వారి పేరు మీదుగా ఏటేటా దుస్తులు పంచడం, భోజనాలు పెట్టడం లాంటివి చూస్తూనే ఉన్నాం.
ఇక, అంత్యక్రియల సమయంలో కాటికాపరితో పాటు మరికొందరికి డబ్బులను ఇస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమయంలో డబ్బుల కోసం డిమాండ్ చేయడం గురించి వార్తల్లో చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. అంత్యక్రియల సమయంలో మృతుడి కుటుంబీకులను కాటికాపరి డబ్బుల కోసం డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటంబాన్ని డబ్బులు డిమాండ్ చేశాడో కాటికాపరి. కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, నేరల్ తండాకు చెందిన దీప్ సింగ్ (46) గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆదివారం అతడి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు కుటుంబీకులు.
అయితే చితి వద్దకు చేరుకున్న కాటికాపరి చితిపై పడుకున్నాడు. రూ.5 వేలు ఇస్తే గానీ చితిపై నుంచి లేవనని పట్టుబట్టాడు. చివరకు మృతుడి కుటుంబీకులు అతడికి రూ.2 వేలు ఇవ్వడంతో అడ్డు తప్పుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. వ్యక్తి చనిపోయి దుఃఖంలో ఉన్న ఫ్యామిలీని ఇలా డబ్బులు అడగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చితిపై అలా పడుకోవడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. మరి, స్మశాన వాటికలో అంత్యక్రియల సమయంలో డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ కాటికాపరి చితిపై పడుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.