సాయంత్రం వేళ కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రహదారులపై మోకాళ్ల లోతు వరద పారుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని ఏరియాల్లో గ్యాప్ ఇస్తున్న వాన.. మరికొన్ని ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా కురుస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, సూరారం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఇదిలావుండగా, రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Now cast warning, Met. Center, Hyderabad, 07-09-22, 19:00 IST: pic.twitter.com/l20pGEfcQO
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 7, 2022