హైదరాబాద్ మహానగర సుందరీకరణ మొదలయ్యింది. భాగ్యనగరానికి అడ్డుగోడలా ఉన్న ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శుంకుస్థాపన చేశారు. 2023 వేసవి నాటికి దీన్ని అందుబాటులోకి తేనున్నారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడెల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేయనున్నారు.
నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు, మొత్తంగా 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ లేదు. తెలంగాణ మొదటి రాష్ట్రం కానుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి మోడల్ డెమో కింద 50 మీటర్లు సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
The works on the 23-km cycle track along the Service Roads of Outer Ring Road (ORR) from Nanakramguda to Telagana Police Academy (TSPA) & Narsingi to Kollur covered with solar panel rooftops along with entire stretch costing Rs 95 crore will begin from tomorrow. @XpressHyderabad pic.twitter.com/4MM2tDTBvi
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) September 5, 2022
Had promised that we will develop a world-class, solar-roofed cycling track in Hyderabad. Laying the foundation tomorrow for an initial 21 KM
Plan to deliver it before summer 2023 👍 pic.twitter.com/YTUzvfb4XX
— KTR (@KTRTRS) September 5, 2022
ఇదీ చదవండి: రూ.20 లక్షల ఒప్పందంతో భర్తను హత్య చేయించిన భార్య! వెలుగులోకి సంచలన నిజాలు!
ఇదీ చదవండి: 2024లో కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమే: సీఎం కేసీఆర్