మీరు నిత్యం మెట్రో రైలు ప్రయాణం సాగిస్తుంటారా..? అయితే ఈ కథనం మీకోసమే. మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముఖ్యంగా టర్మినల్ స్టేషన్ల నుండి బయలదేరే ఆఖరి రైల్ సర్వీస్‌ల సమయాల్లో ఈ మార్పులు చేశారు.
మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయుష్-2023) ముగియడంతో మెట్రో రైలు ఆఖరి సర్వీస్‌లు గతంలో మాదిరిగానే రాత్రి 11 గంటలకు బయల్దేరనున్నాయి. టర్మినల్ స్టేషన్లైన ఎల్‌బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్ నుంచి చివరి మెట్రో రైళ్లు బయల్దేరతాయి. రాత్రి 12 గంటల వరకు గమ్యస్థానానికి చేరుకుంటాయి. మారిన టైమింగ్స్ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు.
కాగా, నుమాయిష్ సందర్భంగా మెట్రో ట్రైన్ ఆఖరి సర్వీస్‌ల వేళలను మరో గంట పొడిగిస్తున్నట్లు గతంలో అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఆఖరి సర్వీస్‌లను అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ఎల్బీ నగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో ఈ వేళలు అందుబాటులో ఉన్నవి. ఇప్పుడు ఎగ్జిబిషన్ పూర్తి కావడం తో పాత టైమింగ్సే అమల్లోకి వచ్చాయి. 46 రోజుల పాటు లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలు ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అందించిన సేవలకుగాను నుమాయిష్ ముగింపు రోజు కియోలిస్ స్టేషన్స్ డీజీఎం జైపాల్‌రెడ్డిని మంత్రి మమహమ్మద్ అలీ అభినందించారు. జ్ఞాపికను అందజేశారు. ఒకవేళ మీరు మెట్రోలో ఎక్కువుగా ప్రయాణిస్తూ ఉంటే మారిన టైమింగ్స్ పై ఓ లుక్కేయడం మంచింది.
#HyderabadMetro Rail was recognised and felicitated by the All India Industrial Exhibition (AIIE) #Numaish society for its seamless efforts in facilitating visitors traveling by metro to reach the 82nd AIIE Numaish-2023 exhibition.@mahmoodalitrs @CPHydCity
#82ndAIIEnumaish2023 pic.twitter.com/LHpKZMA2i5— L&T Hyderabad Metro Rail (@ltmhyd) February 16, 2023