ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్ పేపర్ లీకేజ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక వెంటనే స్పందించిన టీఎస్పీఎస్సీ అధికారులు రానున్న రోజుల్లో జరగనున్న పలు పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఈ అంశంలో తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఇది హ్యాకింగ్ కాదని, హనీట్రాప్ అని తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్ పేపర్ లీకేజ్ ను గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అయితే తాజా విచారణలో మాత్రం ఇది హ్యాకింగ్ కాదని, హినీ ట్రాప్ లో భాగంగానే పేపర్ లీకేజ్ జరిగిందని పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. ఇక ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో జరగనున్న పలు పరీక్షలను సైతం టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది.
పేపర్ లీకేజ్ అంశంలో భాగంగా అనుమానంగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి టీఎస్పీఎస్సీ ఆఫీసుకు తరుచు ఓ అమ్మాయి వస్తుండేదట. ఆ అమ్మాయితో పీఏ ప్రవీణ్ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఇదే చనువుతో ప్రవీణ్ ఆ అమ్మాయికి ఇంకాస్త దగ్గరయ్యాడని, దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పీఏ ప్రవీణ్ ఆ యువతి కోసం పేపర్ హ్యాక్ చేసి లీక్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో భాగంగా పీఏ ప్రవీణ్ తో మరో ఏడుగురు వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? దళారులు ఎవరైనా ఉన్నారా? అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారుతోంది. ఓ అమ్మాయి ట్రాప్ లో పడి పేపర్ లీకేజ్ కు పాల్పడినట్లు వార్తలు వస్తున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.