ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి.. మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. రోడ్లపై జన సంచారం అప్పుడే తగ్గిపోతుంది.. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల మొదటి వారం నుంచి భానుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒక్కపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో మార్చి రెండో వారం అంటే 15 వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఒక్కపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో 15 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటి పూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ప్రత్యేకంగా ఆదేశించింది. ఇక 2022-23 గాను అకాడమిక్ సంవత్సరం ఏప్రిల్ 24 చివరి వర్కిండే. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవు గా కొనసాగుతాయి. అన్ని పాఠశాలలు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుందని తెలిపింది.
పదవ తరగతి విద్యార్థులకు ఈ విషయంలో కొంత మినహాయింపు ఇస్తున్నారు. టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలక మేరకు వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా టెన్త్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 10 నుంచి 17 వరకు 1 వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు సాగుతున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.