తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి కావాలంటూ ఓ చిన్నారి సోది చెప్పింది. సిద్ధిపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చిన్నారి ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం చిన్నారి చేసిన ఈ వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
టి.హరీశ్ రావు.. ఈ పేరు రాజకీయలపై అవగాహన కలిగిన వారికి ప్రత్యేకంగా పరిచయ అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మామ కేసీఆర్ తో కలిసి ఉద్యమం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ లో మంత్రిగా పని చేశారు. మామ నేర్పిన రాజకీయాల పాఠాలతో ఇప్పుడు దేశంలోనే ఓ గొప్పనేతగా ఎదిగారు. అలానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనను ట్రబుల్ షూటర్ గా పిలుస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖలకు మంత్రిగా హరీశ్ రావు పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది కేసీఆర్ తరువాత ఆయనే సీఎం అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. తాజాగా హరీశ్ రావుకు సోది చెప్పిన చిన్నారి సైతం ఈ వ్యాఖ్యలు చేసింది. హరీశ్ రావు సీఎం కావాలంటూ ఓ చిన్నారి సోది చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ పార్టీలో కానీ, తెలంగాణ ప్రభుత్వంలో కానీ కేసీఆర్ తరువాత నెంబర్ టూ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఇద్దరి పేర్లే. ఒకరు హరీశ్ రావు కాగా మరొకరు కేటీఆర్. ప్రస్తుతం ఇద్దరు కేసీఆర్ కెబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో హరీశ్ రావుది ప్రత్యేక శైలి. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీని తనదైన చాతుర్యంతో బలంగా నిలబడేలా చేశారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తరువాత హరీశ్ రావే ముఖ్యమంత్రి అంటూ చాలా సందర్భల్లో ప్రచారం జరిగింది.
ఇప్పటికే పలు సందర్భాల్లో హరీశ్ రావు సీఎం అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోది చెప్పే ఓ చిన్నారి సైతం హారీశ్ రావు సీఎం కావాలంటూ కోరింది. సోమవారం సిద్ధిపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమ్మేళనానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి మంత్రి హరీశ్ రావుతో అక్కడి వచ్చిన నేతలు వివరించారు. అలానే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అనంతరం ఓ చిన్నారి సోది చెప్పేందుకు మంత్రి హరీశ్ వద్దకు వెళ్లింది.
హరీశ్ రావు గారికి సోది చెప్పాలని మంత్రిగారి ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఆ బాలిక తెలిపింది. అందుకే నాచార్ పల్లి నుంచి సోది చెప్పేందుకు వచ్చానని తెలిపింది. అనంతరం హరీశ్ రావు గారి బాల్యం నుంచి రాజకీయంలో కీలక నేతగా ఎదిగిన వరకు అన్ని విషయాలను ఆపాప తెలిపింది. చివరకు హరీశ్ రావు ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ ఆ చిన్నారి సోది చెప్పింది. దీంతో అక్కడి వారందరూ సంతోషంతో చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి చెప్పిన సోదిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.