అధికారులు విధి నిర్వహణలో చేసే కొన్ని పనులు అప్పుడే క్రీడల్లో వెలుగులోకి వస్తున్న యువత జీవితాన్ని దయనీయంగా మార్చేస్తుంటాయి. “కౌసల్య కృష్ణమూర్తి” సినిమాలోని ఓ సీన్ తలపించేలా తాజాగా ఓ యువ మహిళ క్రికెటర్ ఇంటిని.. పురాతానమైనదిగా గుర్తించి అధికారులు కూల్చేశారు. దీంతో ఆ మహిళ క్రికెటర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. హైదరాబాద్ చోటుచేసుకున్న ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి అనే యువ క్రికెట్.. తండ్రి బి.మల్లేశ్ తో కలసి నివాసం ఉంటుంది. మల్లేశ్ ప్లంబర్ గా ని చేస్తున్నాడు. శ్రావణి క్రికెట్ లో బాగా రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఈనెల 15 నుంచి పుదుచ్చేరి జరిగే మహిళల టీ-20 టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె ఉంటున్న పురాతన ఇల్లు ఏ క్షణంలో అయినే కూలిపోయే ప్రమాదం ఉందని ముందుగా నోటీసులు జారీ చేసి, బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో GHMC అధికారులు కూల్చి వేశారు. ఇల్లు కూల్చివేయడంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్‌కు షిఫ్ట్ అయ్యారు. గత 35 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నట్లు శ్రావణి తెలిపింది. అయితే ఈ విషయమై శ్రావణి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.శ్రావణి మాట్లాడుతూ..” మా ఇంటి వెనుక గోడ కూలిపోయేలా ఉందంటూ.. కొన్ని రోజులు క్రితం GHMC అధికారుల నుంచి మాకు నోటీసు అందింది. అయితే వారి నోటీసు స్పందించిన మేము ఆ గోడను రిపేర్ చేయించుకున్నాము. అయితే, అధికారులు ఆ గోడను చెక్ చేయడానికి రాక పోగా. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి క్షణాల్లో ఇంటిని కూల్చేశారు” అని శ్రావమఇ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ నెల 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే మహిళ టీ-20 టోర్నమెంట్ లో పాల్లొనాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా? లేదా ఇంటి కోసం పోరాటం చేయాలా తెలియట్లేదని శ్రావణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.