భారీ వర్షాలు వస్తే గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో ఎక్కడ గోతులు ఉంటయో తెలియదు.. కొన్ని చోట్ల నాలాలు మృత్యు కుహరాలుగా మారుతుంటాయి.
తెలంగాణలో నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చిన్నపాటి నదుల్లా ప్రవహించాయి. భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం అయ్యింది.. ఈ క్రమంలో హైదరాబాద్ కళాసీగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారు నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలి అయ్యింది. మ్యాన్ హూల్ మూత తెరిచి ఉండటంతో ఆ బాలిక డ్రైనేజ్ లో పడిపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో కళాసీగూడలో విషాదం నెలకొంది. పదేళ్ల బాలిక నాలలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలో ఉదయం తెల్లవారు జామున భారీగా వర్షం కురిసింది. సికింద్రబాద్ కళాసీగూడకు చెందిన పదేళ్ల మౌనిక అతని సోదరుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఇంటి నుంచి బయలుదేరారు. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఓపెన్ చేసిన నాలా గుర్తించకుండా మౌనిక ఆమె సోదరుడు అందులో పడిబోయారు. సోదరుడిని రక్షించి మౌనిక తాను నాలాలో పడిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకొని పాపను రక్షించే ప్రయత్నం చేశారు.. కుదరకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ లోని పార్క్ లేన్ సమీపంలోని నాలాలో మౌనిక మృత దేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఉన్న కూతురు కనిపించని లోకాలకు వెళ్లడంతో మౌనిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై జీహెచ్ఎంసీ సీరియస్ అయ్యింది. ఘటనకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. బేగం పేట డివిజన్ అసిస్టెంట్ ఇంజనీరు తిరుమల్లయ్య, వర్క్ ఇన్స్ పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేసింది. అంతేకాదు ఈ ఘటనపై సమగ్ర నివేదిక పది రోజుల్లో ఇవ్వాలని ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఇందిరా భాయ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మౌనిక నాలాలో పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.