ఇటీవల వరుసగా రాజకీయ నేతలు తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మరణించారు. ఈ మరణ వార్తలు మర్చిపోక ముందే మరో నేత కన్నుమూశారు.
ఇటీవల వరుసగా ప్రముఖులు, రాజకీయ నేతలు తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సాయన్న కన్నుమూశారు. వీరి మరణ వార్తలు మర్చిపోక ముందే మరో రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే బుధవారం తుది శ్వాస విడిచారు. మెట్‌పల్లి (ప్రస్తుత కోరట్ల నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు బుధవారం కన్నుమూశారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ సమయంలో మెట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి కొమిరెడ్డి రాములు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004-2009 వరకు ఆయన మెట్‌పల్లి ఎమ్మెల్యేగా కొనసాగారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా కొమిరెడ్డి రాములు కొనసాగారు. ఆయన మృతిపట్ల కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.