రేయింబవళ్లు శ్రమించి పండించిన పంట.. కోత కోసే సమయానికి వన్యప్రాణులు వచ్చినాశనం చేస్తుంటాయి. దీంతో రైతుల కష్టం అంత బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. అడవి జంతువులన నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రైతు ఎలుగుబండిని పంటకు కాపలాగా పెట్టాడు. ఎలుగుబండి ఏంటి.. పంటకి కాపాలాగా ఉండటమేంటి అనే సందేహం మీకు రావచ్చు. అసలు విషయం ఏంటిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాలకు చెందిన రైతు భాస్కర్ రెడ్డి అనే వేసిన పంటను కోతులు నాశనం చేస్తున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి పంటను వదలక పోవడంతో విసుగు చెందాడు. చివరికి ఈ రైతు కోతుల నుంచి పంటను కాపాడుకోవడనానికి వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబండిని చూస్తే కోతులకు భయమని గతంలో ఎవరో చెప్పగా విన్నాడు. వెంటనే పట్నం వెళ్లి రూ. 10 వేలు పెట్టి గుడ్డేలుగు బొమ్మ కొన్నాడు.ఓ కూలీకి ఎలుగుబంటి వేషం వేయించి కాపలా ఉంచుతున్నాడు. దీంతో కోతులు, అడవి పందుల బాధ తప్పిందని రైతు భాస్కర్ రెడ్డి చెబుతున్నాడు. పంట రక్షణ కోసం వినూత్నంగా ఆలోచించిన భాస్కర్ రెడ్డిని తోటి రైతులు అభినందిస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు రైతు వేసిన ఈ వెరైటి ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.