మద్యం మత్తులో వీరంగం సృష్టించే మగవాళ్లని మనం చాలా మందినే చూసుంటాం. ఇక వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వారితో మాట్లాడడానికి ఎంతటి మేధావైనా వెనకడుగు వేయాల్సిందే. అట్లుంటది మరి తాగినవారితో.. అయితే ఓ మహిళ మద్యం మత్తులో చేసిన వీరంగం వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది. సదరు మహిళ నడి రోడ్డుపై కూర్చుని చేసిన హంగామ అంతా.. ఇంతా.. కాదు. ఈ మహిళ దెబ్బకి పోలీసు సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చిందంటేనే అర్దం చేసుకోవాలి.. ఆ మహిళ ఎంతటి వీరంగం సృష్టించిందో! ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్లితే..
అది కామారెడ్డి జిల్లా.. కొత్త బస్టాండ్ సమీపాన ఓ మహిళ నడి రోడ్డుపై కూర్చుంది. దీంతో దారిన పోయే వారు పాపం ఏం కష్టం వచ్చిందో? తెలుసుకుందాం అని పలకరించ బోయారు. ఇక అంతే సంగతులు ఫుల్లుగా మద్యం తాగిన సదరు మహిళ తన గోడునంతా వెళ్లదీసుకుంటూ.. వచ్చి పోయే వాహనదారులకు చుక్కలు చూపించింది. అక్కడి నుంచి వెళ్లమని వారు చెప్పినా వినలేదు. దీంతో రంగంలోకి పోలీసులు దిగాల్సి వచ్చింది. పోలీసులు ఏం జరిగింది అని అడగడంతో ఏడుస్తూ.. తన బాధ చెప్పుకుంది. తన మెుదటి భర్త చనిపోయాడని, దాంతో కొన్ని నెలల తర్వాత మరో అతడిని రెండో పెళ్లి చేసుకున్నానని తెలిపింది.
అయితే ఇప్పుడు అతడు నన్ను బాగా కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నన్ను కొడుతుంటే నా కొడుకులు గానీ కూతుర్లు గానీ ఎవరూ ఆపడం లేదని పోలీసులకు చెప్పింది. మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అంటే మెుదట లేదని చెప్పిన సదరు మహిళ తర్వాత ప్లేట్ ఫిరాయించి నిజం ఒప్పుకుంది. పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరగా.. ఆమెకు సర్ది చెప్పి ఇంటి దగ్గర వదిలి పెట్టి వచ్చినట్లు సమాచారం. ఈ సంఘటనతో అక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది. మరి మద్యం తాగి నానా హంగామా సృష్టించిన సదరు మహిళ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.