హైదరాబాద్ లోని గోషామహల్ ప్రాంతంలో ఓ పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అందులో పడిపోయాయి. నాలాపై ఉన్న కూరగాయల బండ్లు, దుకాణాలు కూడా నాలాలోకి పడిపోయాయి. శుక్రవారం గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో ఉండే పెద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో స్థానికులు భయాందోళన గురయ్యారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గోషామహల్ లోని చాడ్నివాడి ప్రాంతంలో నడి రోడ్డుపై ఉన్న పెద్ద నాలా అర కిలోమీటరు మేర కుంగిపోయింది. అయితే నాలా కుంగిపోయే సమయంలో దానిపై ఉన్న పలు వాహనాలు అందులో పడిపోయాయి. శుక్రవారం మార్కెట్ కావడంతో నాలాపైనే కూరగాయలు, ఇతర సరకులతో వ్యాపారులు ఉన్నారు. అదే సమయంలో మార్కెట్ కావడంతో జనాల రద్దీ కూడా బాగా ఉంది. ఈ ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాలు నాలాలో పడిపోయాయి. నాలాపై దుకాణాలు నిర్వహిస్తున్నవారు.. వాటితో సహా నాలాలో పడి.. తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ శబ్దంతో ఒక్కసారిగా నాలా కుంగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో 1980, 90 ల్లో ఈ నాలా కూలిపోయిందని, ఇన్నేళ్ల తరువాత ఇవాళ మరోసారి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
గోషామహల్, నాపల్లి పరిధిలోని అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి , గోషామహల్ పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా మురికి నీరు ప్రవహిస్తుంది. నాలాపై ఇష్టానుసారంగా ఆక్రమ నిర్మాణాసు నాలా కుంగిపోయిందనే అభిప్రాయాలను స్థానికులు, అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కుంగే సమయంలో రద్దీ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి.. పరిశీలించారు. నాలా కుప్పకూలిన ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నిజంగానే అక్రమ నిర్మాణాల కారణంగా ఈ నాలా కుప్పకూలిందా? లేదా మరేదైన కారణంతో ఈ పెద్ద నాలా కుంగిపోయిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.