మంచినీళ్ల నుండి మద్యం వరకు అన్నీ కల్తీనే. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తినుబండారాలే కాదూ.. ఇంటి సరుకుల్లో కూడా ఘోరమైన కల్తీ జరుగుతుంది. అసలు మనం తెచ్చుకుంటున్న ఉత్పత్తులు ఒరిజనలా, కల్తీనా అనే విషయం కూడా తెలియదు.
ఈ రోజుల్లో ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో తెలియడం లేదు. ఎటు చూసినా కల్తీ ప్రొడక్టులు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మంచినీళ్ల నుండి మద్యం వరకు అన్నీ కల్తీనే. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి తినుబండారాలే కాదూ.. ఇంటి సరుకుల్లో కూడా ఘోరమైన కల్తీ జరుగుతుంది. అసలు మనం తెచ్చుకుంటున్న ఉత్పత్తులు ఒరిజనలా, కల్తీనా అనే విషయం కూడా తెలియదు. తేనె, నెయ్యి, నూనె, చివరకు మిరియాలతో సహా అన్నినాణ్యత లేని ఆహార పదార్థాలు మార్కెట్‌లో పెద్ద మొత్తంలో దొరికేస్తున్నాయి. అదీ నకిలీది అని తెలియకుండా స్మార్ట్‌గా ప్యాకేజ్ చేసి మార్కెట్‌లోకి వదిలేస్తున్నారు తయారీదారులు. వాటిని కొనుగోలు చేసి వాడేసి, అనారోగ్యం తెచ్చుకుంటున్నారు వినియోగదారులు.
హైదరాబాద్ వంటి నగరాల్లో హడావుడి జీవితం, సమయం లేకపోవడం వెరసి వంటింట్లో కొన్ని ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసుకోవడం మానేశారు మహిళలు. వంటకు అవసరమైన చిన్నచిన్న పనులను కూడా చేయలేకపోతున్నారు. దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు కొంత మంది వ్యాపారస్థులు. అలా వచ్చినవే వేగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి. వీటిలో కల్తీ లేదా అంటే చెప్పలేం. ఇటీవల నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి పేస్టులను తయారు చేస్తూ దొరికిపోయింది ఓ సంస్థ. అత్తాపూర్ పోలీసులు చేపట్టిన రైడ్స్‌లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నయాజమాని జావేద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లం లేకుండానే ఈ పేస్టు తయారు కావడం కొసమెరుపు.
మార్కెట్‌లో పాడైపోయిన అల్లం, వెల్లుల్ని పెద్దమొత్తంలో జావేద్ కొనుగోలు చేసి వాటితో నాణ్యత లేని పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లం ధర ఎక్కువ ఉన్న సమయంలో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కోహినూర్ బ్రాండ్‌తో కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నాడు. కుళ్లిపోయిన దశలో, మురుగు వాసనతో కూడిన వెల్లుల్లి బస్తాలను తీసుకువచ్చి.. ఎసిటిక్ యాసిడ్‌తో మిక్స్ చేసి, కొన్ని రసాయనాలు కలిపి కల్తీ అల్లం, వెల్లుల్లి పోస్టు తయారు చేసి మార్కెట్‌లోకి పంపిస్తున్నాడు. ఈ తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని, ఫుడ్ సేఫ్టీ పర్మిషన్లు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇవి తింటే ప్రాణాలు పోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇలాంటి ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించాలని చెబతున్నారు.