బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను కాస్త ప్రతిష్ఠాత్మకంగా భావించాయి. అయితే ఈ క్రమంలోనే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక టీఆర్ఎస్ ఎలాగైన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని కంకణం కట్టుకుంది. ఇక ఇదే కాకుండా హుజురాబాద్ లో ఈ పథకాన్ని కొన్ని చోట్ల అమలు చేసింది. ఈ పథకంతో దళిత ఓట్లను లాక్కుని ఉప ఎన్నికల్లో గెలిచేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. కానీ హుజురాబాద్ ఓటర్ల తీర్పు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావటంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.
ఇక ఈ గెలుపు అనంతరం ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు అంతా హుజురాబాద్ లో గెలుపు కోసమే ఈ పథకాన్ని రూపొందించారని, ఇక నుంచి ఈ పథకాన్ని అమలు చేయరంటూ మాటల తూటాలు పేల్చారు. ఇలా దళిత బంధు అమలుపై వస్తున్న వార్తలను తిప్పికొట్టాడు సీఎం కేసీఆర్. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు పథకం అమలుపై ఎవరు మాటలు నమ్మొద్దని సూచించాడు. ఎన్నో ఏళ్ల నుంచి అణగారిన దళిత జాతి అభివృద్ధికి నోచు కోలేదని ఈ పథకం హుజురాబాద్ లనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అములు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.