హైదరాబాద్ మాదాపూర్ లోని HICCలో టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ ప్లీనరీ ప్రారంభమైంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులు స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. ఈప్లీనరీ లో కేసీఆర్ అనేక అంశాల గురించి ప్రస్తావించారు. దేశలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల గురించి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలో నెలకొన్న కరెంట్ కోతల గురించి కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో పొరుగు రాష్ర్టం ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందంటూ వ్యాఖ్యనించారు.
ఇదీ చదవండి: పెట్రోల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి KTR!
తెలంగాణ సరిహద్దులోని మహరాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గడ్, ఏపీ రాష్ట్రాలోని కరెంట్ కోతల గురించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే నడుస్తోంది. ఏపీతో తెలంగాణాను పోల్చుతూ సీఎం కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని మాజీ సీఎంలు చెప్పారు. కానీ తెలంగాణ వెలిగిపోతుందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిలో పరుగులు తీస్తుందని తెలిపారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఆంధ్రాపాలకు నుంచి ప్రతి ఇంటికి నీటి కుళాయి ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు.మరి.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.