ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఊర్లలో వన్యమృగాలను చూసి జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. అంతేకాక మరికొన్ని సందర్భాలో పొల్లాలో పనులు చేసుకుంటున్న రైతులపై మీద కూడా పులు, చిరుతలు దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇలా క్రూర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. అడవులకు ఆనుకొని ఉంటున్న గ్రామాల్లో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో చిరుత హల్ చల్ చేసింది. హెటిరో కంపెనీలో చిరుత సంచారం చేసింది. చాలా సమయం పాటు కష్టపడి రెస్క్యూటీమ్ చిరుతను బంధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత హల్ చల్ చేసింది. గడ్డిపోతారంలోని హెటిరో పరిశ్రమలోని హెచ్ బ్లాక్ లో తెల్లవారు జామున 4 గంటల సమయంలో వెళ్లింది. చిరుతను చూసిన పరిశ్రమ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. చిరుత సంచారంతో పారిశ్రామికవాడలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరిశ్రమ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు వెంటనే హెటిరో పరిశ్రమకు చేరుకున్నారు. చిరుతను బంధించండానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది చాలా సమయం పాటు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఫారెస్ట్ సిబ్బంది చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టేశారు. అనంతరం చిరుతను బోన్ లోకి ఎక్కించి జూకి తరలించారు. అధికారులు చిరుతను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఇటీవల కాలంలో జనవాసాల్లోకి అటవి జంతువుల రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.