అధికారం ఉంది కదా! అని యువతిపై దాడికి దిగిన ఎస్ఐకు తగిన శాస్తి జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు, అతనిపై చర్యలు తీసుకున్నారు.
సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ అత్యుత్త్సహం చూపిన సంగతి తెలిసిందే. తన భార్యతో గొడవపడిందందుకు గానూ ఓ ముస్లిం యువతిపై అతడు చేయి చేసుకున్నాడు. అనంతరం ఆమెను జుట్టుపట్టి మరీ బస్సు నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఎస్సై దాష్టీకం బయటపడింది. ఈ ఘటనపై ప్రజలు, ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆ నివేదిక ఆధారంగా అతనిపై చర్యలు తీసుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. బాధితులు రాత్రి 12 గంటలకు వరకు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాచింది. ఈ దాడిపై బాధితురాలు జగిత్యాల టౌన్-1 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె పోలీస్ స్టేషన్ ముందట స్పందిస్తూ రోదించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇన్ని జరిగాక పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. అతన్ని సస్పెండ్ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అతనిపై 290, 323, 340 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఈ సెక్లన్ల వల్ల సదరు ఎస్సైకి ఎంత శిక్ష పడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. 1000 రూపాయల జరిమానా లేదంటే నెలలోపు జైలు శిక్ష. ఈ శిక్షలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఓ యువతి పట్ల అంత అమర్యాదగా ప్రవర్తించిన అతనికి ఇంత చిన్న చిన్న సెక్షన్లతో కేసులా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షేక్ ఫర్హా(22) అనే ముస్లిం యువతి తన తల్లితో కలిసి సిద్దిపేట నుంచి జగిత్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. అదే బస్సులో జగిత్యాల ఎస్ఐ భార్య ఎక్కి వీరు కూర్చున్న సీట్లోనే కూర్చోవడం జరిగింది. కాసేపటి తరువాత సీటు విషయంపై వీరిమధ్య వాగ్వాదం జరిగింది. ఇంకేముంది తన భర్త ఎస్ఐ అని.. ఈ గొడవ గురించి అతడికి చెప్పానని.. కాసేపట్లో వచ్చి మీ సంగతి చెప్తాడని.. ఫర్హా, ఆమె తల్లిని బెదిరించింది. కాసేపటికి చెప్పినట్లుగానే సదరు ఎస్ఐ సినిమా స్టైల్లో బస్‌ను చేజ్ చేసి లోపలకి ఎంటరయ్యాడు. నా భార్యతో గొడవపడతావా..? అంటూ యువతిపై దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఫర్హా, ఆమె తల్లిని బెదిరించసాగాడు. దీంతో భయపడిన ఫర్హా తన ఫోన్లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్‌కి నంబర్ పంపింది.
రికార్డు చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ ఆమె ఫోనెర్ లాక్కోవడమే కాకుండా, జుట్టుపట్టి మరీ బస్సు నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. అనీల్ భార్య ఆ అమ్మాయి తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా వారంతా చూస్తున్నారే కానీ.. ఏవరూ అతనిని ఆపే సాహం చేయకపోవటం గమనార్హం. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అతనిని నిలదీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవ్వడంతో అతని పాపం పండింది. అతడు ఎస్ఐ కాబట్టే ఇంత చిన్న చర్యలు తీసుకున్నారా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
జగిత్యాల ఘటనలో అనిల్ సస్పెండ్
జగిత్యాల బస్సు డిపో దగ్గర ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై విచారణ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ చర్యలో భాగంగా జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. pic.twitter.com/zNaqWQEJYe
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2023