సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. నీ బుల్లెట్లు బండెక్కి వచ్చేస్తా వా… డుగ్గు.. డుగ్గు.. డుగ్గు అనే పాట సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలఓ వధువు డ్యాన్స్ తో వైరల్ అయిన ఈ పాట ఓ సంచలనం సృష్టించింది. అన్ని ఫ్లాట్ ఫాంమ్స్ లో దుమ్మురేపుతున్న ఈ పాటపై ఎవ్వరు డాన్స్ చేసిన విఫరీతమైన వ్యూస్ తో రెస్పాన్స్ వస్తోంది. ఎంతో మంది మహిళలు, అమ్మాయిలు ఈ పాటపై స్టెప్పులు వేస్తూ ఇరగీదీస్తున్నారు. దీంతో యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఊహించని వ్యూస్ వస్తున్నాయి.అయితే తాజాగా ఈ పాటతో మరో వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలోని పీహెచ్ సీ లో ఆగస్ట్ 15 వ తేదీన బుల్లెట్ బండి పాట పై ఓ నర్స్ డాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ కు తోటి నర్సులు కూడా చప్పట్లు కొట్టి ప్రోత్సాహించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్సు ఆస్పత్రి లోపల డ్యాన్స్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు వేడుక ముగిశాక తోటి నర్సులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా నర్సు డాన్స్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పుడు ఈ పాట కూడా మరింత వైరల్ అవుతుంది. బుల్లెట్ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ఈ సాంగ్ పై డాన్స్ చేస్తూ మరెంత మంది కళాకారులు వెలుగులోకి వస్తారోనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ నర్సు వివరాలు తెలియాల్సి ఉంది.