చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మాంసాహార ప్రియులకు ముఖ్యంగా చికెన్ అంటేనే బాగా ఇష్టం ఉంటుంది. ఒకొక్కరు వారానికి ఒకసారి తింటే… కొంతమంది అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు. రోజూ ఇంట్లో తిని బోర్ కొడుతుందని చెప్పి బయట రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అలా ఓ రెస్టారెంట్లో ఇష్టమైన అరేబియన్ చికెన్ డిష్ తిన్న ఓ నర్సు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె ఓ హోటల్ లో చికెన్ తినడం వల్లే అనారోగ్యం పాలైనట్లు చెబుతున్నారు.
ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. రేష్మీ రాజ్ అనే నర్సు కొట్టాయంలోని ఓ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తోంది. ఆమెకు అరేబియన్ చికెన్ తినాలనిపించి ఫ్రెండ్స్ తో కలిసి ఓ హోటల్ కుు వెళ్లింది. అయితే ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో ఆస్పత్రి పాలైంది. ఆమెకు చికిత్స అందించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలు కోల్పోవడంతో అంతా అనుమానాస్పద మృతి అనుకున్నారు. రేష్మీ రాజ్ అరేబియన్ చికెన్ తిన్న హోటల్ లో తిన్న మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేసి మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆమె మృతి తర్వాత కేరళలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు నిర్వహించారు. మొత్తం 40 హోటళ్లను సీజ్ చేశారు. 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 26 మందికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే నర్సు రేష్మీ రాజ్ ఎలా చనిపోయారనే దానిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. కొల్లాం, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు.
ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు నిర్వహించాలని చెప్పారు. తినుబండారాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాలు కూడా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు. నర్సు రష్మీ రాజ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు.
One more victim of Arabic Food Poison
Reshmi, Nurse by profession succumbed to death following food poison following consumption of Al – Fam chicken in Kottayam
It was in May last year, 16 year old Devananda died following food poison from Shawarma in Kasargod pic.twitter.com/hinjSpKFNn
— HKupdate (@HKupdate) January 2, 2023