బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే మరీ స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీకీ ఎంత ఆదరణ ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎవరైనా ఆ టెస్ట్ కి వావ్ అనాల్సిందే అంటారు. దేశంలోనే కాదు.. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్ అని అంటుంటారు. తాజాగా హైదరాబాద్ బిర్యానీకి ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.
గత కొంత కాలంగా ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పలు ఆహార పదార్థాలపై వివిధ రకాల పరిశోధనలు చేస్తూ ఉంది. తాజాగా వీరు చేసిన పరిశోధనలో హైదరాబాద్ బిర్యానీ ఆరోగ్యకరమైనదని పరిశోధనలో తేలింది. బిర్యానీ కోసం బియ్యం, నూనె, మసాలాలు, కోడిగుడ్డు, మాంసం ఉపయోగిస్తుంటారు.. ఇందులో అనేక పోషకాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పసుపు, జిలకర్ర, అల్లం పెస్ట్, కుంకు పువ్వు లాంటివి ఇందులో కలిపే ఇంగ్రిడియంట్స్ ఆరోగ్యంగా ఉంచడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని అధ్యయనంలో తేలింది. ఈ బిర్యానీ తినడం మంచి ఆరోగ్యకరమైనదని పరిశోధనలో తేలింది.
హైదరాబాద్ బిర్యానీ అంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో ఇష్టపడతారు. విదేశీ పర్యాటకులు సైతం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ కు ఫిదా అవుతుంటారు. హైదరాబాదీ బిర్యానీ అనేది హైదరాబాదీ వంటకాలలో కీలకమైన వంటకం అని చెబుతుంటారు. బిర్యానీ అనే పదం పెర్షియన్ భాష నుండి వచ్చింది. మొఘల్ పాలకుల సమయం నుంచే బిర్యానీకి మంచి ఆదరణ ఉన్నట్లు తెలుస్తుంది.