తెలంగాణలో విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విద్యాశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మూత పడ్డ అన్ని రకాల విద్యా సంస్థలను వచ్చే నెల నుంచి తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నాయి.
ఇక కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలను తెరిచేందుకు సర్కార్ పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే నెల 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇక రాష్ట్రంలో రోజు వారి కరోనా కేసులు చూసుకున్నట్లైతే 350 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు థర్డ్ వేవ్ కూడా వస్తుందన్న వార్తలు కూడా లేకపోలేదు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కాస్త దూకుడు పెంచిదనే చెప్పాలి. దీని కారణంగానే కేసులు క్రమ క్రమగా క్షీణిస్తూ జనాలకు కాస్త ఉపశమనం కల్గిస్తున్నాయి.