వినాయక విగ్రహం పాలు తాగడం, సాయి బాబా విగ్రహం విభూతి రాల్చడం, గర్భ గుడిలోకి పాము రావడం వంటి సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. శివాలయంలోని నంది విగ్రహం పాలు తాగుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. విషయం తెలిసిన వెంటనే భక్తులు గుడికి పోటెత్తారు. శివరాత్రి తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. కచ్చితంగా ఇది శివయ్య లీలే అంటున్నారు భక్తులు. ఆ వివరాలు..
ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివరాత్రి అనంతరం ఇలా జరగడంతో ఆ ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఈ వింత చూసేందుకు మరికొందరు వస్తున్నారు.. గాండ్ల సంఘం శివాలయంలో నందికి పాలు తాగించారు కొందరు భక్తులు. అయితే ఎప్పుడూ లేనిది నంది పాలు తాగడం గమనించి.. షాకయ్యారు. ఆ తర్వాత గిన్నెలు, చెంచాలతో నందికి పాలు తాగించారు. ప్రసుత్తం దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదంతా దేవుడి మహిమగా భక్తులు చెప్పుకుంటున్నారు. మహా శివరాత్రి మహోత్సవం ముగిసిన తర్వాత ఇలాంటిది జరగడంతో ఇదంతా ఆ శివయ్య లీల అని అనుకుంటున్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.. గతంలోనూ ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి..
తాజాగా పక్కనే ఉన్న ఏపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. చిత్తూరు పట్టణంలోని మార్కెట్ చౌక్ వద్ద ఉన్న శివాలయంలో ఓ నంది విగ్రహం నీళ్లు తాగుతోంది. అక్కడున్న కొందరు చెంచాతో నంది విగ్రహానికి నీళ్లు పట్టించగా.. ఆ విగ్రహం నీళ్లను తాగేస్తున్న వీడియో ఇప్పుడు ఒకటి వైరల్‌గా మారింది.. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలియడంతో ఆలయం వద్ద భారీగా క్యూ కట్టారు.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.