నేటి ఆధునిక కాలంలో ఏ పని జరగాలన్నా యంత్ర పరికరాల అవసరం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఇళ్లల్లో అయితే ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వాడకం ఎక్కువైపోయింది. టివి, ఎసి, కూలర్లు, ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్లు నేటి కాలంలో నిత్యావసరంగా మారిపోయింది.
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం కొన్ని రకాల పనులకు ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాలనే వాడుతున్నారు. ముఖ్యంగా బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్నే వినియోగిస్తున్నారు. ఇంటిల్లిపాదికి వంట చేసి, భర్త, పిల్లలను స్కూలుకు, ఆఫీసులకు పంపించి, ఇలా ఇంట్లో పనులతో అలసిపోతుంది గృహిణి. ఈ క్రమంలోనే బట్టలు ఉతతికేందుకు వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. అయితే వాషింగ్ మెషీన్ వాడకంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ప్రమాదభారీన పడతారు. పలు రకాల జాగ్రత్తలతో వాషింగ్ మెషీన్ వల్ల జరిగే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎంత ఉపయోగం ఉంటుందో ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా గృహోపకరణాలు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్ పేలి ప్రాణాంతకంగా మారిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మురికి బట్టలను క్షణాల్లో ఉతికి పెట్టే వాషింగ్ మెషీన్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో అసలు వాషింగ్ మెషీన్ తో వచ్చే ప్రమాదం ఏంటి? దానికి తగిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఏవైనా కరెంటుకు సంబంధించి మైనర్ రిపేర్ లు వచ్చినప్పుడు మనకున్న కొద్దిపాటి అవగాహనతో రిపేర్ చేసేస్తుంటాము. కానీ ఎసిలు ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్ కు సంబంధించి సమస్యలు వస్తే వాటికి సంబంధించిన టెక్నీషియన్ ను పిలిపించుకుంటే మేలు. వాషింగ్ మెషీన్ లో వైర్లు తెగినట్లు గుర్తిస్తే వెంటనే టక్నీషియన్ కు తెలియజేయాలి. ఫ్లగ్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్లగ్ వైర్లు తెగినట్లైతే కొత్తది మార్చుకోవాలి. లేకపోతే వాషింగ్ మెషీన్ షార్ట్ సర్క్యూట్ కుగురవుతుంది. వాషింగ్ మెషీన్ వాడుతున్నప్పడు నీళ్లు వాటర్ కంట్రోల్ ప్యానల్ పై పడకుండా చూసుకోవాలి. వాషింగ్ మెషీన్ స్విచ్ లపై నీరు పడకుండా చూడాలి. తెగిన వైర్లను అతికించేటప్పుడు నాణ్యమైన టేప్ ను వాడాలి. ఎక్స్ పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ తోనే వాషింగ్ మెషీన్ రిపేర్ చేపించాలి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఉంటే వాషింగ్ మెషీన్ వల్ల జరిగే ప్రమాదాలు నివారించుకోవచ్చు.