జనాలకు పండుగల సమయం దగ్గర పడిందంటే చాలు.. షాపింగ్ సీజన్ మొదలైనట్టే. అందులోను స్మార్ట్ ఫోన్స్ విషయంలో ఎల్లప్పుడూ ముందే ఉంటారు. అందుకే ఫెస్టివల్ సీజన్ వస్తుందంటే.. మొబైల్ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లో ప్రవేశపెడుతుంటాయి. కొంతకాలంగా బయటికి రాలేదు కానీ సామ్ సంగ్(Samsung) కంపెనీ Samsung Galaxy S21 FE సిరీస్ లాంచ్ చేసేందుకు అన్నివిధాలా రెడీ అవుతోంది.
అయితే Samsung Galaxy S21 FE కస్టమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2022 సందర్భంగా.. జనవరి 5 నుండి 8 వరకు ఈ ప్రదర్శన జరపనున్నట్లు తెలుస్తుంది. నిజానికి Samsung Galaxy S21 FE మొబైల్ ప్రస్తుతం జనాలు వెయిట్ చేస్తున్న Android స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి అని చెప్పవచ్చు. అయితే.. దీనికి సంబంధించి హైలైట్స్ ఇలా ఉన్నాయి.
ప్రైస్:
Samsung Galaxy S21 FE ఈ ఏడాది ప్రారంభంలో సేల్స్ ప్రారంభించనుంది. అయితే.. 6GB RAM + 128GB స్టోరేజ్ మొబైల్ ధర EUR749 (దాదాపు రూ.64,200) ఉంటుందని, WinFuture నివేదిక ప్రకారం.. 8GB RAM + 256GB స్టోరేజ్ మొబైల్ ధర EUR 819(దాదాపు రూ.70,500) ఉంటుందని సమాచారం.
లాంచ్:
2022లో Samsung నుండి రాబోతున్న ఫస్ట్ మొబైల్ ఇదే. జనవరిలో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందట.
డిజైన్:
ఇది 2021లో లాంచ్ చేసిన వనిల్లా Samsung Galaxy S21ని పోలి ఉంటుంది. LED ఫ్లాష్ – కెమెరా లెన్స్ కలిగిన ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
స్టోరేజ్:
RAM 6GB, 8GB RAM.. ఇంటర్నల్ స్టోరేజ్ 128GB, 256GB
డిస్ ప్లే:
స్మార్ట్‌ఫోన్ 1080 x 2340 రిజల్యూషన్‌తో 6.4 ఇంచెస్ “ఫ్లాట్ డైనమిక్ AMOLED 2X” ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేతో.. 401ppi పిక్సెల్ డెన్సిటీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది.
స్పెసిఫికేషన్స్:
Samsung Galaxy S21 FE.. Qualcomm Snapdragon 888 చిప్‌సెట్‌తో.. 8GB RAM – 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ రానుంది. మార్కెట్‌ను బట్టి ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 2100 చిప్‌సెట్ తీసుకురానున్నట్లు సమాచారం.
సాఫ్ట్ వేర్:
ఆండ్రాయిడ్ 11-బేస్డ్ వన్ UI 3.0తో.. ఆండ్రాయిడ్ 12కి అప్‌డేట్ చేయబడుతుంది.
కెమెరా:
Samsung Galaxy S21 FE ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 12-MP ప్రైమరీ, 8-MP టెలిఫోటో సెన్సార్, 12-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. అలాగే 32-MP సెల్ఫీ కెమెరాతో రావచ్చు
బ్యాటరీ:
4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ – వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది. అలాగే వైర్‌లెస్ పవర్‌షేర్ ఫీచర్‌తో వస్తుందని టాక్.
కనెక్టివిటీ:
ఈ మొబైల్ తో.. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5, NFC, USB టైప్-సి పోర్ట్ లతో పాటు ఇతర కనెక్టివిటీ ఆప్షన్స్ తో రాబోతుంది. దీని సెన్సార్ విషయానికి వస్తే.. యాక్సిలెరోమీటర్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సెన్సార్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ లను కలిగి ఉంటుంది.