సామాన్యంగా మనకు ల్యాండ్ ఫోన్ అంటే.. కీప్యాడ్, రిసీవర్ ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా మనం వాడే వస్తువులలో సరికొత్త ప్రామాణాలు సంతరించుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త ల్యాండ్ ఫోన్ వైరల్ అవుతోంది. ల్యాండ్ ఫోన్ లో కొత్తదనం ఏముంటుంది..? అని ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ల్యాండ్ ఫోన్ లో కూడా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉంటే.. ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కొత్తగా ఉంది కదా!
అలాంటి కొత్త అనుభూతిని కలిగించేందుకు మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అందులో ఏముంటుంది.. హలో తప్పా ఏమి చేయలేమని భావించేవారికి ఖచ్చితంగా ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ సర్ప్రైజ్ చేస్తుంది. ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్ పేరు KT5(3C). వాస్తవానికి ఇది టాబ్లెట్ లాంటిదే. కానీ ల్యాండ్ ఫోన్ లుక్కులో దీని రిసివర్ అమర్చారు. ఇది ఎల్ఈడీ డిస్ప్లే కలిగి.. అన్ని రకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. వీడియోస్ తో పాటు అదిరిపోయే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మాక్సిమం మన స్మార్ట్ ఫోన్లో ఉండే ఫీచర్స్ ఉంటాయి.
ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్ సంబంధించి ఫోటోలను నికీ టోంస్కీ.. అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా షేర్ చేసాడు. అలాగే కొత్తరకం ల్యాండ్ ఫోన్‌ను లుక్‌తో పాటు స్పెసిఫికేషన్స్ షేర్ చేసాడు. ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్.. KT5(3C) టాబ్లెట్ ఆండ్రాయిడ్ 10.0 ఆపరేటింగ్ సిస్టమ్, ఎల్టీఈ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్లాగే ఇందులో సిమ్ కార్డు వేసుకోవాలి. వాట్సప్, యూట్యూబ్‌తో పాటు అన్నీ యాప్స్ వాడుకోవచ్చు. కాల్ వస్తే ఈజీగా స్క్రీన్ పై స్వైప్ చేసైనా మాట్లాడవచ్చు.
ఈ స్మార్ట్ ల్యాండ్ ఫోన్లో 2500 ఎంఏహెచ్ రీచార్జబుట్, రిమువబుల్ బ్యాటరీ ఉంటుంది. స్టాండ్‌బై మోడ్‌లో 140 గంటల వరకు చార్జింగ్ ఆపుతుంది. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయినప్పటికీ.. పవర్ సప్లైకి కనెన్ట్ చేసి మాట్లాడవచ్చు. మొదట్లో ఈ ల్యాండ్ ఫోన్ ఫేక్ అనుకున్నారు. కానీ టాబ్లెట్ మోడల్ ల్యాండ్ ఫోన్స్.. చైనా ఈకామర్స్ అలీ బాబాలో అందుబాటులో ఉన్నాయి. దీని ధర ప్రస్తుతం 115 – 140 డాలర్స్(అంటే రూ.8500 – 10,500/-) అని పేర్కొన్నాడు నికీ టోంస్కీ. ప్రస్తుతం ఈ స్మార్ట్ ల్యాండ్ ఫోన్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందేమో చూడాలి. ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయవచ్చు.
We’ve come full circle pic.twitter.com/SuBb2K3W54
— Niki Tonsky (@nikitonsky) November 29, 2021