స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటికే కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కి అదనంగా గ్యాడ్జెట్స్ కూడా వాడుతుంటారు. ప్రొటెక్షన్ కోసం అయితే బ్యాక్ కేస్, ట్యాంపర్డ్ గ్లాస్ వంటివి కూడా వాడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాక్ కేస్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మాత్రం తెలుసుకోరు.
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది అందరి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఒక్కరోజు ఫోన్ లేకుండా బతకండి అని చెబితే.. ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదు. ఉయ్యాల్లో ఆడుకునే పిల్లల నుంచి నడుం వంగి పోయిన అవ్వల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారు. ఇంక యువత విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరమే లేదు. స్మార్ట్ ఫోన్ లేకుండా వారికి ముద్ద కూడా దిగట్లేదు. అయితే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కానీ.. సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దాని వల్ల ఫోన్లు పాడవటమే కాకుండా వారి డబ్బు కూడా వృత్థా అవుతోంది. వాటిలో ముఖ్యంగా ఫోన్ పౌచ్ విషయంలో చాలా మంది తప్పు చేస్తున్నారు.
అందరూ స్మార్ట్ ఫోన్ కొనడటమే కాదు.. దానికి కచ్చితంగా పౌచ్ కొంటూ ఉంటారు. చాలా కంపెనీలు ఫోన్ తో పాటుగా పౌచ్ ని ఉచితంగా ఇస్తున్నారు. ఇంక బయట మార్కెట్ లో అయితే చాలా రకాల పౌచ్ లు ఉన్నాయి. క్లియర్ కేస్, హాప్ కేస్, ఫుల్ కేస్, ఫ్లిప్ కేస్ అబ్బో ఇలా చాలానే పౌచ్ లు ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ కి కేస్ వల్లే కలిగే లాభం ఏంటి? అనే ప్రశ్న వేసుకోకుండానే వాటిని కొనేస్తున్నారు. పౌచ్ వల్ల మీ స్మార్ట్ ఫోన్ కి కలిగే ఒకే ఒక లాభం.. ఎప్పుడైనా పొరపాటున కింద పడిపోతే డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అయితే దాని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని మాత్రం గ్రహించడం లేదు.
ఫోన్ కి పౌచ్ లను వాడటం వల్ల కలిగే ప్రధాన సమస్య వెడెక్కడం. స్మార్ట్ ఫోన్ అనేది మీరు వాడక పోయినా కూడా బ్యాక్ ఎండ్ లో వర్క్ అవుతూనే ఉంటుంది. కొన్ని ప్రాసెసర్స్ వల్ల ఫోన్లు త్వరగా హీటవుతాయి. అదే ఫోన్ కి పౌచ్ ఉంటే ఫోన్లు మరింత హీటవుతాయి. పైగా పౌచ్ వల్ల ఆ వేడి త్వరగా తగ్గదు కూడా. దాని వల్ల ఫోన్ కే కాదు.. మీకు కాడా చాలా ప్రమాదం. అందుకే రోజులో కొద్దిసైపు అయినా ఫోన్ కి పౌచ్ తీయాలి. ముఖ్యంగా గేమ్స్ ఆడే సమయంలో ఫోన్ కేస్ లేకుండా చూసుకోవడం ఉత్తమం.
ఫోన్ కి పౌచ్ వాడటం వల్ల ముఖ్యంగా మీ ఫోన్ బ్యాక్ ప్యానల్ డిజైన్ చెడిపోతుంది. చాలా స్మార్ట్ ఫోన్లకు కేస్ వల్ల బ్యాక్ ప్యానల్ కలర్ పోవడం, ఫేడ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ కింద పడిన ప్రతిసారి పౌచ్ వల్ల ప్యానల్ కి గీతలు పడుతూనే ఉంటాయి. కేసు ఉన్నా కూడా ఫోన్ కి కచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అయితే అది పైకి కనిపించకపోయినా కూడా ఇంటర్నల్ కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడైనా ఫోన్ పౌచ్ తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి.
సాధారణంగా మీ టాయిలెట్ సీట్ పైకంటే కూడా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని చెబుతుంటారు. అందుకే స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే మీకు బ్యాక్ పౌచ్ వాడటం వల్ల ఆ బ్యాక్టీరీయాకి తోడు దుమ్ము, ధూళి కూడా తోడవుతుంది. బ్యాక్ కేస్ వల్ల మీ ఫోన్ బ్యాక్ ప్యానల్ పై, పౌచ్ లో డస్ట్ ఎక్కువగా పేరుకుంటుంది. దాని వల్ల మీరు అనారోగ్యం పాలయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు. అందుకే మీరు ఎప్పుడూ పౌచ్ వేసే ఉంచితే.. కొన్ని రోజులకు ఒకసారైనా దానిని క్లీన్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా మీరు స్మార్ట్ ఫోన్ కి వేసే ట్యాంపర్డ్ గ్లాస్ కూడా పౌచ్ వల్ల దెబ్బతింటూ ఉంటుంది. ఇప్పుడంటే కర్వ్డ్ గ్లాసెస్ వచ్చాయి కాబట్టి ఆ సమస్య తీరింది.