మరి కొన్ని నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వాటన్నికంటే ముందుగా ఇండియన్ బ్యాటర్ ఒక ట్రీట్ ఇచ్చాడు. పాకిస్థాన్ బౌలర్ అమీర్ ని బౌలింగ్ లో విధ్వంసం సృష్టించాడు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఆ మ్యాచ్ కి నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ రెండు జట్లు ఐసీసీ మ్యాచుల్లో తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం ఎప్పుడో మానేశాయి. దీంతో వీరిద్దరి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ప్రతిసారి ఐసీసీ టోర్నీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎప్పుడెప్పుడు భారత్ తో పాక్ మ్యాచ్ ఆడుతుందా మన బ్యాటర్లు వారి బౌలింగ్ ని చితక్కొట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏడాది ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో మూడు నుంచి నాలుగు మ్యాచులు చూసే జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఈ మ్యాచుల కోసం అటు పాకిస్థాన్ ఫ్యాన్స్, ఇటు ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో అతృత్తగా ఎదురు చూస్తున్నారు. అయితే వాటన్నికంటే ముందుగా ఇండియన్ బ్యాటర్ ఒక ట్రీట్ ఇచ్చాడు. పాకిస్థాన్ బౌలర్ అమీర్ ని బౌలింగ్ లో విధ్వంసం సృష్టించాడు.
టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విధ్వంసానికి మారు పేరైన ఈ మాజీ హిట్టర్ టీమిండియాలో కన్నా ఐపీఎల్ లోనే బాగా పాపులర్ అయ్యాడు. ఎన్నో మ్యాచుల్లో తన పవర్ హిట్టింగ్ తో సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన యూసఫ్ పఠాన్.. ప్రస్తుతం యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా నిన్న జరిగిన మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నాలుగు పదుల వయసులో కూడా తనలో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపిస్తూ కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 80 చేసి అజేయంగా నిలిచాడు. 140 పరుగుల భారీ లక్ష్యం కళ్లెదుటే ఉన్నా ప్రత్యర్థి బౌలర్లని ఊచ కొత్త కోస్తూ తన జట్టుకి ఒంటాయి చేత్తో ఫైనల్ కి చేర్చాడు.
యూసఫ్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా డర్బన్ ఖలాండర్స్ జట్టుతో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో జోబర్గ్ బఫ్పాలోస్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచులో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒకప్పటి పాకిస్తాన్ స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్ లో ఒక్క ఓవర్లోనే 26 పరుగులు పిండుకున్నాడు. అమీర్ వేసిన 6 బంతులను వరుసగా 6,6,0,6,2,4 బాది మ్యాచ్ ని ఏకపక్షం చేసేసాడు. యూసఫ్ చేసిన 80 పరుగులో 70 పరుగులు బౌండరీల రూపంలోనే ఉండడం గమనార్హం. ప్రస్తుతం పఠాన్ ఇన్నింగ్స్ నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. ఎంత భారీ ఇన్నింగ్స్ ఆడినా ఇలా ఒక పాకిస్థాన్ బౌలర్ ని చితక్కొట్టడం ఇండియన్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తుంది. మరి పఠాన్ విధ్వంసం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Yusuf Pathan smashed 6,6,0,6,2,4 in an over against Mohammad Amir.
The Madness of Yusuf Pathan – This is Brutal. pic.twitter.com/dE9t5ihZ6i
— CricketMAN2 (@ImTanujSingh) July 28, 2023