ఐపీఎల్ దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. మిగతావాళ్ల సంగతేమో కానీ పాక్ స్టార్ క్రికెటర్ ఒకడు పోస్ట్ పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ఇదే చర్చకు కారణమైంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పినా సరే కాదని అనరు. ఎందుకంటే పెద్ద పెద్ద జట్లలోని ఆటగాళ్లు, మాజీలు కూడా కోహ్లీని పొగుడుతూ ఉంటారు. విరాట్ గతంలో ఫామ్ కోల్పోయినప్పుడు ఇతడిని చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఇప్పుడు సెంచరీలు చేస్తుంటే మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇదంతా పక్కనబెడితే తాజాగా ఐపీఎల్ లో దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. దీనిపై పాక్ స్టార్ క్రికెటర్ ఒకరు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అదికాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. ఉప్పల్ లో కోహ్లీ సెంచరీతో రఫ్ఫాడించాడు. సన్ రైజర్స్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో క్లాస్ అండ్ కూల్ బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ తో పాటు టీమిండియా తరఫున టీ20ల్లోనూ కోహ్లీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. దీంతో పాక్ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్’ అని క్యాప్షన్ పెట్టుకొచ్చాడు.
పాకిస్థాన్ లో బాబర్ ఆజామ్ ని అందరూ కింగ్ అని పిలుస్తుంటారు. కోహ్లీతో పోల్చి చూస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఆమిర్.. స్వయంగా కోహ్లీని వన్ అండ్ ఓన్లీ కింగ్ అని పిలవడం, ఇన్ స్టాలో ఏకంగా పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారిపోయింది. చెప్పాలంటే ఈ పోస్ట్.. పాక్ ఫ్యాన్స్ ముందు బాబర్ పరువు తీసినట్లే అనిపిస్తుంది. సొంత దేశ కెప్టెన్ పై పరోక్షంగా కౌంటర్ వేసేలా ఉన్న ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి కోహ్లీ సెంచరీ, ఆమిర్ పోస్ట్ పెట్టడంపై మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.