పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో ఇద్దరు క్రికెటర్లు గొడవ పడినంత పనిచేశారు! బాబర్ ఫోర్ కొట్టేసరిక్ ఆమిర్ తట్టుకోలేకపోయాడు. అలా చేసి తన ఫ్రస్టేషన్ తీర్చుకున్నాడు.
క్రికెట్ లో కొన్ని చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలానే కోపతాపాలకు ఏం కొదవలేదు. నేరుగా, పరోక్షంగా అయినా సరే అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు ఫ్రస్టేషన్ తీర్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సేమ్ ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఇద్దరు పాక్ క్రికెటర్ల మధ్యే ఈ సంఘటన జరిగింది. అందులో ఒకడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కాగా, మరొకడు మాజీ ఆటగాడు మహమ్మద్ అమిర్. వీళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోనూ అదే హల్ చల్ చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ లో ప్రస్తుతం టీ20 ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. రెండో మ్యాచ్ పెషావర్- కరాచీ జట్ల మధ్య జరిగింది. ఇక టాస్ గెలిచిన పెషావర్ జాల్మీ జట్టు బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ ఆమిర్ వేయగా.. బాబర్ ఆజమ్- మహమ్మద్ హరీష్ 11 పరుగులు రాబట్టారు. మళ్లీ ఆరు ఓవర్ వేసిన ఆమిర్ బౌలింగ్ లో బాబర్ ఓ బంతిని బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత బాల్ ని బాబర్ డిఫెండ్ చేశాడు. అది కాస్త ఆమిర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే తన బౌలింగ్ లో బౌండరీలు కొడుతుండేసరికి ఆమిర్ తట్టుకోలేకపోయాడు.
తన చేతుల్లోకి వచ్చిన బంతిని బాబర్ ఆజమ్ వైపు విసిరేశాడు. అయితే అది కాస్త మరోవైపు వెళ్లింది. అయితే బాబర్ బౌండరీ కొట్టడం, ఆమిర్ ఫ్రస్టేషన్ కు లోనవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఒకే దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇలాంటి సంఘటన జరిగేసరికి నెటిజన్స్ కూడా తెగ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో 2 పరుగుల తేడాతో పెషావర్ జట్టు విజయం సాధించింది. బాబర్ (68), టామ్ కోహ్లెర్ (92) అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. ఆమిర్-బాబర్ వీడియోలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
𝒀𝒐𝒖 𝒄𝒂𝒏’𝒕 𝒃𝒐𝒘𝒍 𝒕𝒐 𝒉𝒊𝒎 𝒕𝒉𝒆𝒓𝒆 ❌
Babar flicks to deliver the loosener from Mohammad Amir to the boundary 💫#HBLPSL8 #PSL2023 #KKvPZ #CricketTwitter pic.twitter.com/SlDftupj00
— CricWick (@CricWick) February 14, 2023
Mohammad Amir vs Babar Azam💥#HBLPSL8 #PSL2023 #KkvPz #PzvKk pic.twitter.com/fLXOND5XH7
— Muhammad Noman (@nomanedits) February 14, 2023