టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా తరఫున టీ20ల్లో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డును నెలకొల్పాడు. శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో తొలుత బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన సుందర్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ ఒంటరి పోరాటం చేశాడు. పేస్ బౌలర్లు విఫలం అవుతున్న చోట.. అద్భుతంగా బౌలింగ్ చేసిన సుందర్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి.. టీమిండియాను మ్యాచ్‌లోకి తెచ్చాడు. 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి డేంజర్‌గా మారుతున్న ఫిన్ అలెన్‌ను అవుట్ చేసిన సుందర్.. అదే ఓవర్‌లో మార్క్ చాప్‌మన్‌ను అద్భుతమైన క్యాచ్‌తో డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన సుందర్.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
ఇక బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(47) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమైనా.. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి.. అద్భుత పోరాట పటిమ చూపించాడు. టీమిండియా న్యూజిలాండ్‌కు ఇవ్వాల్సిన రన్స్ కంటే 20 పరుగులు అదనంగా ఇచ్చిందనే చెప్పాలి. లేకుంటే.. వాషింగ్టన్ సుందర్ పోరాటానికి ఫలితం దక్కి ఉండేది. అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో సుందర్.. టీమిండియా తరఫున టీ20ల్లో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సుందర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గతంలో దినేష్ కార్తీక్ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 26 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును వాషింగ్టన్ సుందర్ బ్రేక్ చేశాడు. అలాగే సుందర్‌కే ఇదే తొలి టీ20 ఫిఫ్టీ కావడం విశేషం.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాన్వె 52, మిచెల్ 59 పరుగులతో రాణించారు. ముఖ్యంగా మిచెల్ చివర్లో విధ్వంసం సృష్టించాడు. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మూడు సిక్సులు, ఒక ఫోర్, రెండు డబుల్స్‌తో ఏకంగా 27 రన్స్ రాబట్టాడు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అర్షదీప్, కుల్దీప్, శివమ్ మావీ తలో వికెట్ తీసుకున్నారు. ఇక 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసి.. 21 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. కాగా.. భారత్-కివీస్ మధ్య రెండో టీ20 లక్నో వేదికగా ఆదివారం జరగనుంది. మరి తొలి టీ20లో వాషింగ్టన్ సుందర్ ప్రదర్శన, నెలకొల్పిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Washington Sundar, you beauty. What a catch. 👀
Washington Sundar Also smashed fifty from just 25 balls, What a ball striking.#WashingtonSunder #INDVsNZT20 #MSDhoni #NZvIND pic.twitter.com/Ac0NvlVKKF— Aviral Mishra (@BJP4AVIRAL) January 27, 2023