ఉపఖండపు పిచ్ ల మీద ఆసియా కప్ జరుగుతున్నా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ కి 17 మందిలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
గత మూడు సీజన్ లుగా ఘోర ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సారి జట్టులో భారీ మార్పులు చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ తో పాటు ఇద్దరు ఇండియన్ స్టార్ల మీద కూడా వేటు వేయనున్నట్లు సమాచారం.
సన్ రైజర్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్.. తెలుగు యాంకర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడట. ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్ తో పాటు క్రికెట్ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. ఇంతకీ సుందర్ లైఫ్ లో ఏం జరుగుతోంది?
హైదరాబాద్ జట్టుకి బిగ్ షాక్. అసలే కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ కి ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి చేరింది. ఆ జట్టు బౌలింగ్ అల్ రౌండర్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు.
శుక్రవారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ధోని నుంచి తప్పించుకోవడం కష్టం అని మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఒక కొత్త బ్రాండ్ గేమ్‌ను ఆడుతున్నాడు. ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగాపేరుతెచ్చుకున్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో పోలిక పొంది.. కొన్ని రోజులకే అతన్ని మరిపించే ప్లేయర్‌గా ఎదిగాడు. టీ20 క్రికెట్‌లో తనకు మాత్రమే సాధమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియాలో ఒక సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న సూర్యుకుమార్ యాదవ్ ఆటతోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో డౌన్ టూ ఎర్త్‌గా ఉంటూ […]
న్యూజిలాండ్‌తో శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైనా.. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. బౌలింగ్ మిగతా బౌలర్ల కంటే ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసిన సుందర్.. బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. టీ20ల్లో టీమిండియా తరఫున ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. రికార్డు సృష్టించాడు. గతంలో […]
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా తరఫున టీ20ల్లో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డును నెలకొల్పాడు. శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో తొలుత బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన సుందర్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ ఒంటరి పోరాటం చేశాడు. పేస్ బౌలర్లు విఫలం అవుతున్న చోట.. అద్భుతంగా బౌలింగ్ చేసిన సుందర్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి.. టీమిండియాను […]
రాంచీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో కివీస్ ధాటిగానే ఆడుతోంది. ఓపెనర్ ఫిన్ అలెన్ మెరుపులు మెరిపించడంతో మంచి శుభారంభమే అందుకుంది. అయితే, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి.. మ్యాచును చేజారిపోకుండా కాపాడాడు. ఐదో ఓవర్ రెండో బంతికి ఫిన్ అలెన్ (35)ను అవుట్ చేసిన సుందర్, అదే ఓవర్ ఆఖరి బంతికి కళ్లు చెదిరే క్యాచ్ పట్టి చాప్‌మన్ (0)ను పెవిలియన్ దారి పట్టించాడు. టాస్ […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పంత్ మోకాలికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూజిలాండ్ తో సిరీస్ లోని చివరి వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ […]