తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ రోజు విరాట్ కోహ్లీ చేసిన పనివల్ల చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా ఇంతలా ఫీల్ అవ్వలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే కాక వరల్డ్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తన డ్యాషింగ్ బ్యాటింగ్ తో వరల్డ్ క్లాస్ బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టించేవాడు. డ్యాషింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న సెహ్వాగ్.. మైదానంలో మాత్రం కూల్ గా కనిపిస్తాడు. అదీకాక వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు అనే పేరుకూడా ఉంది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ రోజు విరాట్ కోహ్లీ చేసిన పనివల్ల చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్. తన జీవితంలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా ఇంతలా ఫీల్ అవ్వలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి అంతలా సెహ్వాగ్ ను విరాట్ కోహ్లీ ఎలా ఫీల్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరేంద్ర సెహ్వాగ్-విరాట్ కోహ్లీ ఇద్దరు ఇద్దరే.. వరల్డ్ క్రికెట్ లో తనదైన ముద్రవేసుకుంది ఒకరైతే.. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో పాలిస్తున్నది మరొకరు. మరి ఈ ఇద్దరి ఘనుల మధ్య జరిగిన ఓ సంఘటన సెహ్వాగ్ ను బాధకుగురిచేసింది. కోహ్లీ తనను ఓ రికార్డును అందుకోకుండా అడ్డుకున్నాడు అంటూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ..”గతంలో మేం ఇద్దరం కలిసి ఆడేక్రమంలో..నా బౌలింగ్ లో విరాట్ ఓ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ పడితే.. నేను ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసేవాడిని. కానీ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయడంతో.. ఆ అవకాశం చేజారింది. అప్పడు కోహ్లీపై పట్టలేనంత కోపం వచ్చింది. నేను ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా అంతలా బాధపడలేదు. కానీ అప్పుడు కోహ్లీ చేసిన పని నన్ను ఎంతో బాధించింది” అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇక విరాట్ గురించి మరింతగా చెప్పుకొస్తూ.. అప్పట్లోనే చాలా మంది విరాట్ పెద్ద స్టార్ అవుతాడని చెప్పేవారని, అయితే నేను మాత్రం నమ్మలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు సెహ్వాగ్. కానీ శ్రీలంకపై ఓ మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేశాక నాతో పాటుగా మరికొందరి అభిప్రాయాలు మారాయి అంటూ చెప్పుకొచ్చాడు వీరూ భాయ్.ఇక సచిన్ 100 సెంచరీల రికార్డుకు కోహ్లీ తప్పకుండా బ్రేక్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి విరాట్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల రికార్డు మిస్ అయ్యిందని సెహ్వాగ్ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.