మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. 260 పరుగుల లక్ష్యాన్ని 42.1 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించి.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో టీమిండియా నయా డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 125 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు.
72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను అద్భుత సెంచరీతో అదుకున్నాడు. చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయి.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో పంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. పంత్ విషయంలో కాస్త భిన్నంగా స్పందించాడు.
42 ఓవర్‌లో విల్లే బౌలింగ్‌లో పంత్ తొలి ఐదు బంతులను ఐదు ఫోర్లు బాది విధ్వంసం సృష్టించాడు. కానీ.. ఆ ఓవర్ చివరి బంతికి మాత్రం సింగిల్ తీశాడు. అది కూడా కావాలని సింగిల్ తీసునట్లు ఉంది. చివరి బంతికి కూడా ఫోర్ కొట్టి ఉంటే మ్యాచ్ ముగిసిపోయేది. కానీ.. పంత్ అలా చేయలేదు. ఇదే విషయంపై స్పందించిన సెహ్వాగ్.. ‘42వ ఓవర్ చివరి బంతికి పంత్ గనుక ఫోర్ కొట్టి ఉంటే మ్యాచ్ అపుడే ముగిసేది. అదనంగా పరుగు తీయాల్సిన అవసరం కూడా లేదు. అయితే, పంత్.. ఆ బంతిని ఫోర్ కాదు.. ఏకంగా సిక్స్‌గా మలచాల్సింది. ఒకవేళ నేనే గనుక రిషభ్ పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఫోర్ లేదంటే సిక్సర్ బాదేవాడిని’’ అని అన్నాడు.
పంత్‌ది కూడా సేమ్ సెహ్వాగ్ శైలే.. ఇద్దరు వచ్చిన బంతిని వచ్చినట్లు బాదడమే పనిగా పెట్టుకుంటారు. కానీ.. వరుసగా ఐదు ఫోర్లు కొట్టిన తర్వాత పంత్ సింగిల్ ఎందుకు తీశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. మరి 42వ ఓవర్ చివరి బంతికి పంత్ సింగిల్ తీయడం, దానికిపై సెహ్వాగ్ కామెంట్స్‌పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former India batter Virender Sehwag praised #RishabhPant for playing a match-winning knock against England in the third and final ODI#ENGvIND https://t.co/O7RTFKYkfb
— CricketNDTV (@CricketNDTV) July 18, 2022