టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. తాజా టెస్టు కెప్టెన్‌గా కూడా తప్పుకుంటున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కోహ్లీ ప్రకటన చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా కూడా తప్పుకున్నాడు. ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సైతం థ్యాంక్స్ చెప్పాడు. కాగా కోహ్లీ తర్వాత టీ20, వన్డేలకు కెప్టెన్‌గా నియామకం అయిన రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Virat Kohli (@imVkohli) January 15, 2022