వికెట్ల మధ్య పరుగు తీయడంలో కోహ్లీని మించినవారు లేరనే చెప్పాలి. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇదే విషయంపై విరాట్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు .
క్రికెట్ లో పరుగులంటే కేవలం బౌండరీల రూపంలో వస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రతిసారి బౌండరీలు కొట్టడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో సింగిల్స్, డబుల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాటర్లు ఒత్తిడికి గురైనప్పుడు బౌండరీల ద్వారా పరుగులు రాబట్టి బౌలర్లపై ఆధిపత్యం చూపించాలనుకుంటారు. కానీ చాలా కొద్ది మంది బ్యాటర్లు మాత్రమే బౌండరీలు గురించి ఆలోచించకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ప్రత్యర్థి జట్టుకి చిరాకు తెప్పిస్తారు. అలాంటి అరుదైన బ్యాటర్ల లిస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఒకడు. క్రికెట్ లో సింగిల్స్ డబుల్స్ ఎంత ముఖ్యమో నిన్న కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఇప్పుడు వీటి గురించి కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కోహ్లీ ఎం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచ క్రికెట్ లో పరుగుల పరంగానే కాదు ఫిట్ నెస్ విషయంలోనూ విరాట్ కోహ్లీ టాప్ లో ఉంటాడు. ఏళ్ళ తరబడి అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్నా.. ఇప్పటికీ ఆటతో సమానంగా ఫిట్ నెస్ కి సమాన ప్రాధాన్యం ఇస్తాడు. వెస్టిండీస్ తో రెండో టెస్టు సందర్భమగా విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే అతని ఫిట్ నెస్, ఆట మీద మీద అంకిత భావం ఎలాంటిదో అర్ధం అవవుతుంది బౌండరీలు రావడం కష్టంగా ఉన్న ఈ పిచ్ మీద విరాట్ ఎక్కువగా సింగిల్స్, డబుల్స్ మీదే దృష్టి సాధించాడు. 161 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 87 పరుగులు చేసి తొలి రోజు అజేయంగా నిలిచాడు. విండీస్ జట్టుకి ఇదే చికాకు కలిగించింది. ఫోర్లు రావడలో ఆ జట్టు సఫలమైన, వికెట్ల మధ్య విరాట్ వేగాన్ని ఆపలేకపోయారు.సింగిల్ ని రెండు పరుగులుగా మార్చే క్రమంలో . డైవ్ చేస్తూ మరీ పరుగుల పూర్తి చేశాడు.
ఇది చూసిన విండీస్ వికెట్ కీపర్ డిసిల్వా..నువ్వు డాబాల్స్ ని దొంగిలిస్తున్నావు అని చెప్పుకొచ్చాడు. విండీస్ వికెట్ కీపర్ అనీ మాటలకు విరాట్ స్పందిస్తూ “2012 నుంచి నేను డబుల్స్‌ను దొంగిలిస్తున్నాను” అంటూ సరదాగా పేర్కొన్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయింది. ఇద్దరి మధ్య ఎంతో సరదాగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మరి కోహ్లీ సరదాగా వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.