అప్పటి వరకు టీమిండియా టాపార్డర్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడింది. ఫోర్లు కొట్టడం గగనంగా మారింది. ఓవర్లు అయిపోతున్నా.. చేతినిండా వికెట్లు ఉన్నా.. స్కోర్ బోర్డుపై కావాల్సినన్ని పరుగులు లేవు. ఈ టైమ్‌లో క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ శివాలెత్తి ఆడాడు. హాంకాంగ్ లాంటి చిన్న జట్టుపై టీమిండియాలాంటి ఛాంపియన్ టీమ్ ఎలా ఆడాలో కళ్లకుకట్టినట్లు కొట్టి మరీ చూపించాడు. బంతి దొరికితే బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో 150-160 మధ్య వస్తుందనుకున్న స్కోర్ కాస్తా.. 192కు చేరింది. ఆసియా కప్‌లో బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సులతో 68 పరుగులు చేసి హాంకాంగ్ బౌలర్లును బెంబేలెత్తించాడు.
సూర్యకుమార్‌తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం 44 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నామమాత్రపు స్కోర్ వస్తుందనుకున్న చోటు సూర్య సునామీతో ఊహికందని స్కోర్‌రావడంతో విరాట్ సూర్య బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయాడు. తన సీనియారిటీని సైతం పక్కన పెట్టి సూర్యకుమార్ యాదవ్‌కు బౌ డౌన్ ఇచ్చి మరీ గౌరవించాడు. కోహ్లీ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యకుమార్ యాదవ్ కూడా కోహ్లీ నుంచి అందిన అరుదైన గౌరవానికి పొంగిపోయాడు. తన లైఫ్‌లో ఇలాంటిది ఎప్పుడు తనకు దక్కలేదని అన్నాడు.
కాగా.. ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీ-సూర్యకుమార్ యాదవ్ మధ్య చిన్న ఫైర్ సిచ్యూయేషన్ చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ముంబై డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ.. ‘నేను చూసుకుంటా..’ అని సూర్య చాలా యారెగెంట్‌గా సైగలు చేయడం కోహ్లీకి కోపం తెప్పించింది. అప్పటికే టీమిండియా కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ముందు సూర్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ సైతం విస్మయం వ్యక్తం చేశారు. కోహ్లీ చాలా కోపంగా సూర్యకుమార్ వైపు చూశాడు. సూర్య కూడా ఏ మాత్రం తగ్గకుండా.. కోహ్లీ కళ్లలో కళ్లుపెట్టి చూశాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలేత్తాయని అప్పట్లో వార్తలొచ్చాయి. వారిద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్న ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
తాజాగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ.. కోహ్లీ బౌ డౌన్ ఇవ్వడంతో 2020లో కోహ్లీ, సూర్య ఫొటోను, ఇప్పుడు కోహ్లీ బౌడౌన్ ఇస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘సక్సెస్ అంటే సూర్యకుమార్ యాదవ్.. ఒక్కపుటి శత్రువు సైతం వంగి సలాం కొట్టేలా ఎదిగాడు’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ.. ఈ విషయంలో తన సీనియారిటీని సైతం పక్కన పెట్టి సూర్య లాంటి యువ క్రికెటర్‌కు ఇలాంటి గౌరవం ఇచ్చిన కోహ్లీ గొప్పతనాన్ని మెచ్చుకోవాలని మరికొంత మంది పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీకి అదిరిపోయే గిఫ్ట్.. హృదయాలు గెలుచుకున్న హాంకాంగ్ టీమ్!
Up above the also high
Like a diamond in the ‘SKY’
A terrific innings from India’s Mr. 360 Surya Kumar Yadav 68(26)* 💥 and also a classy 59(44)* from Virat Kohli against Hong Kong . 31st fifty in T20Is for Virat 🥳🤘.#sky pic.twitter.com/ub8chJSvgO— Md Zafar🇮🇳 (@MdZafar52946004) August 31, 2022
Surya Kumar Yadav (@surya_14kumar ) has come a long way.If king 👑 (@imVkohli )praises you this means you have done something different 🇮🇳#INDvHK pic.twitter.com/TCOfNTlos0
— Rishindra Mukherjee (@rishumukherjee) August 31, 2022
Watch: Virat Kohli’s reaction for Surya Kumar Yadav and his innings https://t.co/ApKIS2DW3O via @viralvdoz #ViratKohli𓃵 #SuryakumarYadav #cricket22 #t20worldcup2022 #Breaking #Viravdoz #IndianCricketTeam
— ViralVdoz (@viralvdoz) September 1, 2022
Virat Kohli and surya kumar Yadav after the match #INDvsHK
𝐃𝐨 𝐍𝐨𝐭 𝐌𝐢𝐬𝐬 – Half-centurions @imVkohli & @surya_14kumar chat up after #TeamIndia‘s win against Hong Kong 👍
Full interview📽️👇 #AsiaCup2022 https://t.co/vd2ID3lzow
pic.twitter.com/T9dwvizQZ1— DD Sports (@Mahesh13657481) September 1, 2022