యాషెస్ ఫస్ట్ టెస్టులో ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. మారథాన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటిన ఖవాజా.. క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌లో కంగారూ టీమ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదో రోజు గేమ్ తీవ్ర ఉత్కంఠ స్థాయికి చేరుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (65), ప్యాట్ కమిన్స్ (44)లు ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. జోరుమీదున్న ఇంగ్లీష్ బౌలర్లను కాచుకొని లయన్ (16) అండగా మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు కమిన్స్. దీంతో అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. బజ్‌బాల్ స్ట్రాటజీతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌కు కమిన్స్ టీమ్స్ భలేగా అడ్డుకట్ట వేసిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. బజ్‌బాల్ ప్లాన్ ప్రతి మ్యాచ్‌లోనూ వర్కౌట్ కాదని ఇంగ్లీష్ టీమ్ అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఆడిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన ఖవాజా (141).. రెండో ఇన్నింగ్స్‌లో 65 రన్స్ చేశాడు.
డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరిన వేళ.. ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా ఇంగ్లండ్ బౌలర్లను ఖవాజా అడ్డుకున్న తీరు సూపర్బ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన తేడా ఖవాజా బ్యాటింగే. ప్రత్యర్థి బజ్‌బాల్ స్ట్రాటజీకి తన బ్యాటింగ్‌తో సమాధానం చెప్పాడు. ఈ మ్యాచ్‌లో 5 రోజులు బ్యాటింగ్ చేశాడీ ఆసీస్ ఓపెనర్. తద్వారా టెస్టుల్లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన అరుదైన ప్లేయర్ల లిస్టులో 13వ ప్లేయర్‌గా ఖవాజా చోటు దక్కించుకున్నాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన ఖవాజా.. మ్యాచ్ మొత్తంలో 518 బాల్స్ ఎదుర్కొని 206 రన్స్ చేశాడు. అలాగే యాషెస్ సిరీస్‌లో ఎనిమిదేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన ఆసీస్ ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్లో సెంచరీ బాదిన రెండో కంగారూ ప్లేయర్‌గా నిలిచాడు. 2019 యాషెస్ తర్వాత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఖవాజా.. రీఎంట్రీలో దుమ్మురేపడం, ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించడాన్ని మెచ్చుకోవాల్సిందే.
Usman Khawaja has become the 13th man to bat every day in a five-day Test match 😯#ENGvAUS | #Ashes pic.twitter.com/501vjSSgL8
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2023
Khawaja on Day 1: 4* in 1st innings
Khawaja on Day 2: 126* in 1st innings.
Khawaja on Day 3: 141 in 1st innings.
Khawaja on Day 4: 34* in 2nd innings.
Khawaja on Day 5: 60 in 2nd innings.The fightback has ended, What an incredible performance. pic.twitter.com/d9idZRCy74
— Johns. (@CricCrazyJohns) June 20, 2023
Usman Khawaja faced 518 balls in this Test match and scored 206 runs.
A marathon display from Khawaja ends! pic.twitter.com/Fa1wdZXXpk
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 20, 2023