స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను తమ సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తొలగిస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ విషయంపై బౌల్ట్ కివీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు అలాగే వివిధ లీగ్‌లలో ఆడేందుకు తనకు అనుమతి ఇస్తూ.. సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి తనకు విడుదల కల్పించాలని బౌల్ట్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు కొన్ని రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నాడు.
బోర్డుకు బౌల్ట్‌కు మధ్య పలు దఫాల చర్చల తర్వాత బౌల్ట్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేస్తున్నట్లు కివీస్ బోర్డు వెల్లడించింది. దీంతో బౌల్ట్‌కు యూఏఈ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడేందుకు అవకాశం దక్కింది. కానీ.. సెంట్రల్ కాంట్రక్ట్ నుంచి బయటికి వచ్చేయడంతో బౌల్ట్‌కు న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్ జట్టు ఎంపికలో సెంట్రల్, డొమెస్టిక్ కాంట్రక్ట్ ఉన్న ప్లేయర్లకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో బౌల్ట్ మళ్లీ కివీస్ తరఫున ఆడటం కష్టమే. ఈ విషయాన్ని బోర్డు పెద్దలు బౌల్ట్‌కు వివరించినట్లు చెప్పారు. అయినా కూడా బౌల్ట్ కాంట్రాక్ట్‌ను వదులుకునేందుకే సిద్ధపడినట్లు పేర్కొన్నారు.
ఈ 33 ఏళ్ల పేసర్ తన భార్య, ముగ్గురు కుమారులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. బౌల్ట్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని బోర్డు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బౌల్ట్ మాట్లాడుతూ.. ఇది చాలా కఠినమైన నిర్ణయమని అంగీకరించాడు. అయితే తన కుటుంబం కోసం తప్పలేదని వెల్లడించాడు. నన్ను అర్థం చేసుకున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. తన దేశం కోసం క్రికెట్ ఆడటం చిన్ననాటి కల అని దాన్ని నిజం చేసుకున్నందుకు గర్వపడుతున్నాని అన్నాడు. బౌల్ట్ ఇప్పటివరకు న్యూజిలాండ్ తరపున 78 టెస్టులు, 93 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరి బౌల్ట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Trent Boult has been released from the New Zealand central contract as per his request to spend more time with family & domestic leagues – This will reduce his role in Kiwis and will be eligible in International cricket when he is available.
— Johns. (@CricCrazyJohns) August 10, 2022
Trent Boult! pic.twitter.com/9RPzUsuruy
— RVCJ Media (@RVCJ_FB) August 10, 2022
ఇది కూడా చదవండి: తనని తాను గేగా ప్రకటించుకున్న కివీస్ మాజీ క్రికెటర్!