క్రికెట్ టూర్లలో భాగంగా ఆటగాళ్లు తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలోనే కొంత మంది దొంగలు తమ చేతి వాటాన్ని చూపుతుంటారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ బ్యాగ్ ను దొంగిలించాడు ఓ దొంగ. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా క్రికెటర్లు టూర్ల నేపథ్యంలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలోనే కొంత మంది చోరులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి, ఆటగాళ్ల బ్యాగులు, సెల్ ఫోన్స్ లతో పాటుగా విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇక తాజాగా ఓ స్టార్ క్రికెటర్ దొంగల చేతి వాటానికి గురైయ్యాడు. అతడి బ్యాగును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. దాంతో ఆ దొంగను తిడుతూ.. శాపనార్థాలు పెట్టాడు ఆ ఆటగాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఇక మోకాలి గాయంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ ఈ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాను ప్రయాణిస్తున్న సమయంలో తన బ్యాగ్ ఓ దొంగ కొట్టేశాడు అని స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్టోక్స్ వెల్లడించాడు. లండన్ లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్ లో ఈ దొంగతనం జరిగింది. ఇక ఈ దొంగతనంపై స్టోక్స్ స్పందిస్తూ..”కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్ లో ఎవరో నా బ్యాగ్ కొట్టేశారు. నా బట్టలు నీకు మరీ పెద్దవి కావాలి” అంటూ ఆ దొంగను బూతులు తిట్టి, శాపనార్ధాలు పెట్టాడు.
ఇక స్టార్ క్రికెటర్ బ్యాగ్ దొంగలించడంపై ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ దొంగను పోలీసులు పట్టుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం సిద్దం అవుతున్నాడు స్టోక్స్. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.16.25 కోట్లకు కోనుగోలు చేసింది. అయితే మోకాలి గాయంతో బాధపడుతున్న స్టోక్స్ ఐపీఎల్ ఆడతాడో లేదో అన్న అనుమానం ఉంది. ఈ అనుమానాలకు తెరదించుతూ.. తాను ఐపీఎల్ ఆడుతాను అంటూ స్పష్టం చేశాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.
To who ever stole my bag at King’s Cross train station.
I hope my clothes are to big for you ya absolute ****** 😡— Ben Stokes (@benstokes38) March 12, 2023