సౌత్ ఆఫ్రికాతో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న భారత్‌కు మరో చేదు వార్త అందింది. సౌత్ ఆఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో ఓటమితో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఏకంగా మూడో స్థానానికి దిగజారింది. యాషెస్ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో అగ్రస్థానానికి వెళ్లింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ 117 పాయింట్లతో ఉంది. భారత్ 116 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. దాదాపు ఆరేళ్లుగా ప్రతి ఏడాది చివర్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తు వచ్చింది.
విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు జట్లు కెప్టెన్సీ పగ్గాలు చేబట్టినప్పుడు భారత్ దారుణంగా 7వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత భారత్‌ను టెస్టుల్లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాడు. కాగా ఇటివల విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకున్న వెంటనే భారత్ ర్యాంక్ కూడా పడిపోవడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరి భారత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ మొండితనం ముందు అవన్నీ ఒక లెక్క కాదు