తాజాగా ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో అందరిముందు నవ్వులపాలైయ్యాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.
క్రికెట్ లో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. నవ్వాపుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక సాధారణంగానే కొంతమంది ఆటగాళ్లకు క్రికెట్ కు సంబంధించిన అన్ని నిబంధనలు తెలియక నవ్వుల పాలవుతుంటారు. కానీ కొంత మంది తెలిసి కూడా నిర్ణయాలు తీసుకుని అభిమానుల ముందు నవ్వుల పాలవుతుంటారు. తాజాగా ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో అందరిముందు నవ్వులపాలైయ్యాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.
మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. తొలి వన్డేలో బంగ్లాపై పోరాడి గెలిచింది ఇంగ్లాండ్ జట్టు. ఇక తాజాగా జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య జట్టుకు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది బ్రిటీష్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో తన పరువును తానే తీసుకున్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్. ప్రపంచలో ఏ కెప్టెన్, ఆటగాడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోడు. అసలు విషయం ఏంటంటే? ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 48వ ఓవర్ వేయడానికి వచ్చాడు బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్. ఈ ఓవర్ లో 4వ బంతికి మెుయిన్ అలీని అవుట్ చేశాడు టస్కిన్.
అనంతరం క్రీజ్ లోకి వచ్చాడు ఆదిల్ రషీద్. తాను ఎదుర్కొన్న తొలి బాల్ నే బౌండరీకి తరలించాడు. ఇక తర్వాత బంతిని టస్కిన్ అహ్మద్ అద్భుతమైన యార్కర్ వేశాడు. ఆ బంతిని అంతే అద్భుతంగా డిఫెన్స్ చేశాడు ఆదిల్ రషీద్. అయితే బంతి క్లియర్ గా బ్యాట్ కు తాకినట్లు తెలుస్తుంటే.. తమీమ్ ఇక్బాల్ మాత్రం ఎల్బీడబ్ల్యూ కోరుతూ.. రివ్యూ తీసుకున్నాడు. దాంతో గ్రౌండ్ లో ఉన్న వాళ్లతో సహా.. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి లోనైయ్యారు. అక్కడ క్లియర్ గా బ్యాట్ కు బాల్ తాకినట్లు కనిపిస్తుంటే.. తమీమ్ మాత్రం రివ్యూ కోరాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. దాంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రపంచలో ఏ కెప్టెన్ కూడా ఇలాంటి రివ్యూ తీసుకోడు రా సామీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందరి ముందు నవ్వుల పాలైయ్యావ్ కద తమీమ్ బాబాయ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరును సాధించింది. జట్టులో జేసన్ రాయ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బట్లర్(76) అర్దశతకం సాధించాడు. రాయ్ 124 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్స్ తో 132 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 327 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 15 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (31), షకీబ్ అల్ హసన్ (26) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి చెత్త రివ్యూ తీసుకుని విమర్శల పాలవుతున్న తమీమ్ ఇక్బాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tamim Iqbal reviewed it for LBW.#BANvsENG #ENGvBAN pic.twitter.com/8RQZdPKjHk
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) March 3, 2023
Tamim Iqbal Khan sahab thinks BBW (Bat Before Wicket) is a mode of dismissal. 🙏😭 pic.twitter.com/09uhIRP3bj
— Akif (@KM_Akif) March 3, 2023