సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని చాలా మంది తనయులకు ఉంటుంది. అయితే అలా వారసత్వాన్ని కొనసాగించి విజయవంతమైన కొడుకులు మాత్రం చాలా తక్కువ మందే అనిచెప్పొచ్చు. అలా విజయవంతమైన కొడుకుగా నిరూపించుకుంటున్నాడు వెస్టిండీస్ దిగ్గజం చంద్రపాల్ కొడుకు టగైనారాయణ్ చంద్రపాల్. అతడి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్టులో పరుగుల వరద పారించాడు ఈ చోటా చంద్రపాల్. ఆడిన మూడో టెస్టులోనే డబుల్ సెంచరీ సాధించి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్ లో 207 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో భారీ స్కోరు సాధించింది విండీస్ జట్టు.
శివనారాయణ్ చంద్రపాల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్ గా తన పేరును లిఖించుకున్నాడు. చిన్న జట్టుగా ముద్ర పడ్డ విండీస్ టీమ్ లో జిడ్డు బ్యాటర్ గా పరుగుల వరదలు పారించేవాడు. చంద్రపాల్ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. ఇప్పడు ఇదే పనిని తన కొడుకు టగై నారాయణ్ చంద్రపాల్ కొనసాగిస్తున్నాడు. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఏకంగా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు చోటా చంద్రపాల్. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పసికూన జింబాబ్వేకు తన బ్యాటింగ్ పవర్ ఏంటో రుచి చూపాడు.
తన తండ్రిలాగే బ్యాటింట్ చేస్తూ.. బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 467 బంతులు ఎదుర్కొన్న టగైనారాయణ్ 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 207 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు కెప్టెన్ బ్రాత్ వైట్ (182) పరుగులతో చెలరేగాడు. దాంతో 6 వికెట్లకు 447 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇక ఆడిన మూడో టెస్టులోనే డబుల్ సెంచరీ చేశాడు చోటా చంద్రపాల్. దాంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి చంద్రపాల్ కొడుకు డబుల్ సెంచరీ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Test cricket’s historic moment
Shivnarine Chanderpaul, the father, has two centuries.
Tagenarine Chanderpaul, the son, scored a double century. 💯💯
The father-son team is the first to accomplish this!#WIvsZIM #SChanderpaul #TChanderpaul pic.twitter.com/4GYdE6hg7k
— The 100 (@The100_sports) February 6, 2023