టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి చితక్కొట్టాడు. తన ఫామ్ ని కొనసాగిస్తూ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అదరగొట్టాడు. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ మరోసారి తడబడింది. గత మూడు మ్యాచుల్లో విఫలమైన కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేయగా కోహ్లీ మాత్రం మరోసారి టీంకి అండగా నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ మొదలవడానికి ముందు కోహ్లీ ఫామ్ మీద అందరికీ చాలా సందేహాలు ఉండేవి.
ఇక టోర్నీలో పాక్ తో తొలి మ్యాచ్ లో అదరగొట్టిన కోహ్లీ.. 82 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో 62 పరుగులు చేసి మెప్పించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచు లో 12 పరుగులే చేసి ఔటైన విరాట్.. ఇక బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మాత్రం మరోసారి బ్యాట్ తో చెలరేగాడు. క్లాస్ షాట్స్ ఆడుతూ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్ ల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే(1016) పేరిట ఉంది. ఈ రికార్డును బంగ్లాతో మ్యాచ్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ బద్దలు కొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్.. 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.
Virat Kohli in this T20 World Cup:
82* (53) Vs Pakistan.
62* (44) Vs Netherlands.
12 (11) Vs South Africa.
64* (44) Vs Bangladesh.220 runs at 220 average with 3 fifties in 4 innings.#Kohli#ViratKohli𓃵 #IndvsBan pic.twitter.com/0upxSPABom
— Sagar 🇮🇳 (@biowale_prof) November 2, 2022
King #Kohli at his place … Feeling happy as MSD fan 🔥@imVkohli pic.twitter.com/EzCXwuvsSG
— BIM™🔁 (@ItsmeMBfan) November 2, 2022
Another day another FIFTY
Run Machine King #Kohli #INDvsBAN #T20WorldCup2022 pic.twitter.com/ufpRt9i2JK
— Biju VB (@Biju_Vaisyathil) November 2, 2022
Virat Kohli smashed unbeaten 64 runs off 44 balls.#SkyFair #INDvsBAN #ShakibAlHasan #RohitSharma #ViratKohli #TeamIndia #WorldCup2022 #KLRahul #Kohli pic.twitter.com/R3T8Ac66Ib
— SkyFair (@officialskyfair) November 2, 2022