క్రికెట్ మ్యాచ్ లో క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో.. ఔట్ కాకుండా చూసుకోవడం కూడా అంతే కష్టం. ఎందుకంటే బౌలర్లు, ఫీల్డర్లు.. బ్యాటర్ ని ఎలా పెవిలియన్ కు పంపేయాలా అని చూస్తుంటారు. అందుకే బ్యాటర్లు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా డిస్కషన్ లో నిలిచిన టాపిక్ మన్కడింగ్. దీని బారిన పడ్డ పలువురు క్రికెటర్లు.. ఏం చేయాలో తెలీక బిత్తరచూపులు చూస్తున్నారు. ఇప్పుడు అలా చేసినా సరే ఔట్ కాకుండా ఉండేందుకు కివీస్ యువ క్రికెటర్ ఓ కొత్త టెక్నిక్ కనిపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ లో మన్కడింగ్ లీగల్ చేశారు. బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని బ్యాటర్ రన్ కోసం క్రీజు దాటితే ఎలాంటి వార్నింగ్ లేకుండా రనౌట్ చేయొచ్చు. ఈ మధ్య దీప్తిశర్మ ఇంగ్లాండ్ బ్యాటర్ ని ఇలానే ఔట్ చేసింది. అయితే మన్కడింగ్ రూపంలో బ్యాటర్లకు ఎప్పుడూ ప్రాబ్లమే. ఇప్పుడు దీనికోసం న్యూజిలాండ్ యువ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. అదే 100 మీటర్ల పరుగు స్టార్ట్ చేసే అథ్లెట్ లా మోకాళ్లపై కూర్చున్నాడు. బౌలర్ బంతి వేసే సమయానికి బాణంలా రయ్ మని దూసుకెళ్లాడు. దాంతో బ్యాటర్ బంతిని కొట్టకపోయినా రన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఫిలిప్స్.. ఒకటి రెండుసార్లు వేగంగా పరుగులు కూడా చేశాడు.
ఇదిలా ఉండగా సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులతో ఒంటరిగా అదరగొట్టాడు. ఇతడికి డారిల్ మిచెల్ మాత్రమే 22 పరుగులతో సహకారం అందించాడు. దీంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇక ఛేదనలో శ్రీలంక పూర్తిగా తడబడింది. 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. భనుక రాజపక్స 34, కెప్టెన్ దసున్ షనక 35 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో లంకకు ఓటమి తప్పలేదు. మరి ఫిలిప్స్ కనిపెట్టిన టెక్నిక్ పై మీ అభిప్రాయం ఏంటి?
This was incredible by Glenn Phillips. pic.twitter.com/LGQqDlr8bj
— Johns. (@CricCrazyJohns) October 29, 2022