స్టార్ స్పిన్నర్ అశ్విన్ మరోసారి న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఏకంగా ధావన్ కు చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఇంతకీ అదేంటో తెలుసా?
క్రికెట్ లో ఫన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే కాదు అప్పుడప్పుడు సీరియస్ గొడవలు, వార్నింగ్స్ లాంటివి కూడా కనిపిస్తుంటాయి. ఐపీఎల్ లోనూ ఇలాంటి సీన్స్ చాలానే కనిపిస్తుంటాయి. ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి కానీ అప్పట్లో భౌతికంగా గొడవపడి, కొట్టుకునే వరకు స్టార్ క్రికెటర్లు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంత సీరియస్ ఇష్యూ కానప్పటికీ.. పంజాబ్-రాజస్థాన్ మ్యాచులో ఓ సంఘటన జరిగింది. రాయల్స్ బౌలర్ అశ్విన్.. కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ని బయటపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ తో జరిగిన మ్యాచులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఏకంగా 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ (60), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేశారు. అయితే 7వ ఓవర్ సందర్భంగా అశ్విన్ బౌలింగ్ కు వచ్చాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న ధావన్.. బాల్ వేయకముందే పదేపదే క్రీజు దాటుతున్నాడు. దీంతో అశ్విన్ అతడిని భయపెట్టాడు. మన్కడింగ్ చేస్తాననట్లు వార్నింగ్ ఇచ్చాడు. అదే టైంలో కెమెరామ్యాన్ బౌండరీ లైన్ దగ్గర బట్లర్ ని చూపించాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న వాళ్లతో పాటు కామెంటేటర్స్ నవ్వు ఆపుకోలేకపోయారు.
ఎందుకంటే మన్కడింగ్, అశ్విన్-బట్లర్ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. 2019 ఐపీఎల్ సీజన్ లో పంబాబ్ కు ఆడిన అశ్విన్.. రాజస్థాన్ కు ఆడుతున్న బట్లర్ ని మన్కడింగ్ విధానంలో ఔట్ చేశాడు. క్రికెట్ లో ఈ రూల్ ఉన్నప్పటికీ.. దాన్ని అనైతికంగా భావించేవారు. దీంతో అశ్విన్-బట్లర్ మన్కడింగ్ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద దుమారమైపోయింది. అదిగో ఆరోజు నుంచి మన్కడింగ్ టాపిక్ ఎప్పుడొచ్చినా సరే అశ్విన్-బట్లర్ పేర్లు మార్మోగిపోతూ ఉంటాయి. ప్రస్తుతం వీళ్లిద్దరూ కూడా రాజస్థాన్ జట్టుకే ఆడుతుండటం విశేషం. సరే ఇదంతా పక్కనబెడితే.. అశ్విన్ మన్కడింగ్ కు ప్రయత్నించగానే.. కెమెరా బట్లర్ వైపు చూపించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Ashwin warns Dhawan for backing & then camera shows Buttler.pic.twitter.com/LCoS1WnCOQ
— Johns. (@CricCrazyJohns) April 5, 2023