మన్కడింగ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ రూల్స్ ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నా.. కొంతమంది అది కరెక్ట్ కాదని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, నైతికంగా అవుట్ కాదని అంటున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్ అశ్విన్ లాంటి వాళ్లు మన్కడింగ్ చట్టబద్ధమైందని దాన్ని అనైతికంగా చూడటం మానేయాలని, బ్యాటర్లకు బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని అంటున్నారు. ఇలా మన్కడింగ్‌ను వ్యతిరేకిస్తూ.. సమర్ధిస్తూ.. చాలా రకాల వాదనలే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడా.. మన్కడింగ్‌తో బ్యాటర్లను బౌలర్లు రనౌట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బౌలర్ మన్కడింగ్ చేయడం సంచలనంగా మారింది. అది కూడా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ మన్కడింగ్‌తో బ్యాటర్‌ను అవుట్ చేసింది. అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 సందర్భంగా.. పాకిస్థాన్-రువాండా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మన్కడింగ్ చోటు చేసుకుంది. పాక్ బౌలర్ జమీనా తాహిర్.. రువాండా బౌలర్‌ను మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసింది. ఇప్పటి వరకు అంతర్తాతీయ క్రికెట్‌తో పాటు, లీగ్ దశల్లోనే ఉన్న ఈ మన్కడింగ్ విధానం ఇప్పుడు అండర్ 19 లెవల్‌కు కూడా వ్యాపించిందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
ఉమెన్స్ క్రికెట్‌లో టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్‌ను మన్కడింగ్‌తో రనౌట్ చేయడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు సైతం దీప్తి చేసింది తప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇది అనైతికం అంటూ గగ్గోలు పెట్టారు. అలాగే ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్‌ను మన్కడింగ్‌తో రనౌట్ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా భారత్-శ్రీలంక మధ్య గౌహతీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ మన్కడింగ్‌తో లంక కెప్టెన్ షనకను అవుట్ చేసి అప్పీల్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆ అపీల్‌ను వెనక్కి తీసుకోవాలని షమీని కోరడం.. షనకను అంపైర్ అవుట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు పాక్ క్రికెటర్ మన్కడింగ్ చేయడంపై అవుట్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.