మన్కడింగ్ రూల్ పై ఐసీసీ ఆటగాళ్లకు అవగాహన కల్పించింది. బౌలర్ బంతి విసరకముందే.. బ్యాటర్ క్రీజ్ దాటి బయటికి వెళితే రనౌట్ చేయడం నిబంధనలకు విరుద్దమేమీ కాదని తెలిపింది. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్ లో మన్కడింగ్ ద్వారా బ్యాటర్ ను అవుట్ చేయడంతో ఆ బ్యాటర్ గ్రౌండ్ లోనే వీరంగం సృష్టించాడు.
క్రికెట్ లో ఉన్న అన్ని నిబంధనలు చాలా వరకు చాలా మంది ఆటగాళ్లకు తెలీదనే చెప్పాలి. రోజులు గడుస్తున్న కొద్ది కొత్త కొత్త రూల్స్ అన్ని క్రీడా కారులకు తెలుస్తున్నాయి. అయితే క్రికెట్ ప్రపంచానికి మన్కడింగ్ అనే రూల్ ఉందని, ఆ రూల్ ద్వారా క్రీజ్ దాటిన ఆటగాడిని అవుట్ చేయోచ్చని తొలిసారి తెలియజేశాడు టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అప్పటి నుంచి ఈ మన్కడింగ్ ప్రాచూర్యంలోకి వచ్చింది. దాంతో ఇప్పటికే ఆటగాళ్లకు మన్కడింగ్ రూల్ పై అవగాహన కల్పించింది ఐసీసీ. తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్ లో మన్కడింగ్ ద్వారా బ్యాటర్ ను అవుట్ చేయడంతో ఆ ఆటగాడు గ్రౌండ్ లోనే వీరంగం సృష్టించాడు.
మన్కడింగ్ రూల్ పై ఐసీసీ ఆటగాళ్లకు అవగాహన కల్పించింది. బౌలర్ బంతి విసరకముందే.. బ్యాటర్ క్రీజ్ దాటి బయటికి వెళితే రనౌట్ చేయడం నిబంధనలకు విరుద్దమేమీ కాదని తెలిపింది. అది క్రికెట్ రూల్స్ లో ఒకటి అని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మన్కడింగ్ వివాదం తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా వేదికగా సౌతెరెన్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఓ దేశవాలీ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో క్లీర్ మెంట్-న్యూనోర్ ప్లోక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఓ ఆసక్తికర సంఘటనకు వేదికైంది.
ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్ హార్ బూత్ క్లీర్ మెంట్ బ్యాటర్ అయిన జారోడ్ కైల్ ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. బూత్ బంతి వేయకముందే కైల్ క్రీజ్ దాటాడు. ఇది గమనించిన బూత్ బాల్ వేయకుండా వికెట్లకు కొట్టి.. అంపైర్ కు అప్పీల్ చేశాడు. ఇద్దరు అంపైర్లు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత కైల్ ను అవుట్ అని ప్రకటించారు. దాంతో సహనం కోల్పోయిన అతడు బూతులు తిట్టుకుంటూ.. గ్రౌండ్ లోనే హెల్మెట్ ను తీసి విసిరికొట్టాడు. బ్యాట్ ను గ్రౌండ్ లోనే అవతల పడేశాడు, గ్లోవ్ ని కూడా గ్రౌండ్ లోనే వదిలేశాడు. కోపంతో చిందులు వేశాడా కైల్. అతడి బ్యాట్, హెల్మెట్, గ్లోవ్ ను ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లే కైల్ టీమ్ సభ్యులకు ఇచ్చి వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Extraordinary scenes in the SCA Grand Final between Claremont and New Norfolk over the weekend in Tassie. 🤯
So much to unpack here…#Cricket#Mankad@gradecricketer pic.twitter.com/11TLMcJ6kL
— Bailey Kenzie (@baileykenzie01) March 27, 2023