వర్షం ప్రభావంతో టీ20 ప్రపంచ కప్ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా గ్రూప్-1లో ఈ పోరు ఎక్కువగా కనిపిస్తోంది. దీనంతటికి కారణం.. వరుణుడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లకు మాత్రమే సెమీస్ చేరే అవకాశం ఉండడం, మ్యాచులన్నీ గంగపాలు అవుతుండడంతో సెమీస్ చేరే జట్లు ఏవన్నది అంతుపట్టడం లేదు. ఇదిలా ఉంటే.. సిడ్నీ వేదికగా శ్రీలంక- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచులో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో చెలరేగాడు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా పెవిలియన్ చేరుతున్న తాను మాత్రం శ్రీలంక బౌలర్లకు అడ్డుగోడలా నిలబడ్డాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్ 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 104 పరుగులు చేశాడు. 4వ వికెట్ కు డారీ మిచెల్ తో కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 2 వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, లహిరు కుమారా తలా వికెట్ పడగొట్టారు.
Great knock from Glenn Phillips! 👏#NZvSL | #T20WorldCup pic.twitter.com/aU5hjkoJiB
— The Cricketer (@TheCricketerMag) October 29, 2022
NZ set a target of 168!
Let’s do it Lions!👊#SLvNZ #RoaringForGlory #t20worldcup pic.twitter.com/WfLaP9lI88
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 29, 2022